Women: మహిళల నోట్లో సీక్రెట్ ఆగదా..? ధర్మరాజు శాపమే దీనికి కారణమా..?
మహిళలు తమకు అందిన సమాచారాన్ని తమకు అనుకూలంగా వాడుకుంటారని, తమ పరువు, ప్రతిష్టలను, పరపతిని పెంచుకోవడానికి ఆ రహస్యాన్ని వినియోగిస్తారని ఆ నివేదికలో తెలిపారు.

Women: మహిళల నోట్లో నువ్వు గింజ కూడా నానదు అని అంటూ ఉంటారు. వారికి ఏదైనా విషయం తెలిస్తే, ఎవరికో ఒకరికి చెప్పేదాకా నిద్రపట్టదట. అదే మగవాళ్లు మాత్రం ప్రాణం పోయినా వారి సీక్రెట్ ని బయటపెట్టరట. కనీసం తల్లికి, పెళ్లానికి కూడా చెప్పరట. మహిళలు ఏ రహస్యాన్ని, ఎందుకు రహస్యంగా ఉంచలేరు అంటే.. మహాభారతంలోని ఓ సంఘటనే కారణం అనే చర్చ జరుగుతోంది.
కురుక్షేత్ర యుద్ధంలో.. తమ అన్న కర్ణున్ని చంపినందుకు పాండవులు చింతించారు. కురుక్షేత్ర యుద్ధంలో అనేక మోసాలు జరిగాయ్. ఇందులో కుంతి దేవి పాత్ర కూడా ఉంది. కర్ణుడు తన కుమారుడనే రహస్యాన్ని కర్ణుడి మరణం వరకు కుంతి బయటపెట్టలేదు. ఈ విషయం కుంతి దేవి ముందే చెప్పి ఉంటే కర్ణుడు చనిపోయి ఉండే వాడు కాదు. పాండవులు తన సోదరుడిని చంపేలా చేసింది తన తల్లే అని యుధిష్టరుడు అనుకున్నాడట. అందుకే శాపం పెట్టాడట. అప్పటి నుంచి మహిళలు ఏ రహస్యాన్ని కూడా ఎక్కువ సేపు దాచి ఉంచలేరట.
పురాణాల సంగతి ఇలా ఉన్నా సైన్స్ మాత్రం ఇంకోలా చెప్తోంది. జర్నల్ ఆఫ్ ఎక్స్‌పెరిమెంటల్ సోషల్ సైకాలజీలో ఒక కీలక నివేదిక వచ్చింది. మహిళలు తమకు అందిన సమాచారాన్ని తమకు అనుకూలంగా వాడుకుంటారని, తమ పరువు, ప్రతిష్టలను, పరపతిని పెంచుకోవడానికి ఆ రహస్యాన్ని వినియోగిస్తారని ఆ నివేదికలో తెలిపారు. ఇందులో నిజం ఎంత ఉన్నా.. మరో కీలక విషయం మరింత ఆసక్తికరంగా మారింది. నిజానికి పురుషుల నోట్లోనే నిజం ఆగదట. చాలా పరిశోధనలు స్త్రీల కంటే పురుషులే ఎక్కువగా గాసిప్ చేస్తారని తేలింది.
మహిళలు మాత్రం హైలైట్ అవుతున్నారట. ఇద్దరు అమ్మాయిలు మాట్లాడుకోవడం మొదలుపెడితే వారి నోరు అసలు మూత పడదట. తమకు తెలిసిన రహస్యాన్ని ఉపయోగించుకునేందుకు ఎవరైతే ఏంటి.. ఎవరి స్వార్థం వారిది అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు ఈ ఇష్యూలో.