Home » క్రీడలు
క్లే కోర్టులో తిరుగులేని మొనగాడు. ఎర్రమట్టి కోర్టు...అతడికి కంచుకోట. ఒకటా రెండా...ఏకంగా 14 టైటిళ్లు. దిగ్గజాలతో తలపడ్డాడు. అందరిపైనా పైచేయి సాధించాడు. రోజర్ ఫెదరర్, నోవాక్ జకోవిచ్ లకే చుక్కలు చూపించాడు. ఫ్రెంచ్ ఓపెన్, ఆస్ట్రేలియన్ ఓపెన్, వింబుల్డన్ ఓపెన్, యుఎస్ ఓపెన్...టోర్నీ ఏదయినా సత్తా చాటాడు. ఎవరికి అందనంత ఎత్తుకు ఎదిగాడు.
టీ ట్వంటీ ఫార్మాట్ లో భారత్ డామినేషన్ కంటిన్యూ అవుతోంది. వరల్డ్ కప్ విజయం తర్వాత మన జోరు ఏమాత్రం తగ్గలేదు. ఇటీవల సౌతాఫ్రికాతో సిరీస్ లోనూ భారత క్రికెటర్లు దుమ్మురేపారు. వారి సూపర్ ఫామ్ తో ఇప్పుడు టీ ట్వంటీ ర్యాంకింగ్స్ లోనూ మనదే పైచేయిగా నిలిచింది.
క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి అంతా సిద్ధమైంది. శుక్రవారం నుంచి పెర్త్ వేదికగా తొలి టెస్ట్ మొదలుకాబోతోంది. గత రెండు పర్యటనల్లో అదరగొట్టిన టీమిండియా మూడోసారి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీపై కన్నేసింది. అయితే ఈ సారి భారత్ కు అది అంత ఈజీ కాకపోవచ్చు.
ఆస్ట్రేలియాతో భారత్ తొలి టెస్ట్ శుక్రవారం నుంచి ఆరంభం కానుంది. గత వారం రోజులుగా ప్రాక్టీస్ లో బిజీబిజీగా గడిపిన భారత ఆటగాళ్ళు కాస్త రిలాక్సయ్యారు.
ఐపీఎల్ మెగావేలంలో 574 మంది ప్లేయర్స్ షార్ట్ లిస్ట్ అవగా... అందులో అంతర్జాతీయ క్రికెట్ ఆడిన 12 మంది భారత ఆటగాళ్ళు, 208 మంది విదేశీ ప్లేయర్స్ ఉన్నారు. అయితే మొత్తంగా 574 మంది ప్లేయర్స్ వేలానికి వచ్చినా దానిలో 204 మంది ప్లేయర్సే ఆయా ఫ్రాంఛైజీల్లోకి వెళ్లనున్నారు.
ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ఐసీసీ దిమ్మతిరిగే షాకిచ్చింది. ఆతిథ్య దేశ హోదాలో ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్న పాక్ క్రికెట్ బోర్డుకు వార్నింగ్ ఇచ్చింది. భారత్ జట్టు లేకుండా టోర్నీ నిర్వహణ అసాధ్యమని తేల్చేసింది.
ఆ్రస్టేలియా క్రికెట్ జట్టు అసిస్టెంట్ కోచ్ డానియెల్ వెటోరి పెర్త్‌లో భారత్‌తో జరిగే తొలి టెస్టు మధ్యలోనే జట్టును వీడనున్నాడు. ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కు హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న వెటోరీ మెగావేలంలో పాల్గొనేందుకు జెడ్డా వెళుతున్నాడు.
ఆస్ట్రేలియా పిచ్ లు అంటేనే పేసర్ల పండుగ...బౌన్సీ పిచ్ లపై ఆసీస్ పేసర్లు విసిరే బంతులు బుల్లెట్ల కంటే వేగంతో వస్తుంటాయి.. వాటిని కాచుకుంటూ క్రీజులో నిలవడం అంత ఈజీ కాదు.. అందుకే విదేశీ జట్లకు ఇక్కడి పిచ్ లపై బ్యాటింగ్ చేయడం ఎప్పుడూ కఠిన సవాల్ గానే ఉంటుంది.
ఐపీఎల్ మెగావేలం డేట్స్ ఖరారైనప్పటి నుంచి అభిమానుల ఆతృత అంతకంతకూ పెరిగిపోతోంది. వేలంలో ఎవరికి అత్యధిక ధర వస్తుంది... యువ ఆటగాళ్ళలో ఎవరు జాక్ పాట్ కొడతారన్న దానిపై ఎడతెగని చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ కెప్టెన్ రిషబ్ పంత్ హాట్ టాపిక్ గా మారిపోయాడు
ఐపీఎల్ మెగావేలం ఈ సారి రసవత్తరంగా ఉండబోతోంది. పలువురు స్టార్ ప్లేయర్స్ వేలంలోకి రావడమే దీనికి ప్రధాన కారణం.. కొన్ని ఫ్రాంచైజీలు తప్పనిసరి పరిస్థితుల్లో కొందరు కీలక ఆటగాళ్ళను వేలంలోకి విడిచిపెట్టక తప్పలేదు.