మళ్ళీ స్పిన్నర్ల హవానే బెంగళూరు పిచ్ రిపోర్ట్ ఇదే

టీమిండియా మళ్ళీ టెస్ట్ ఫార్మాట్ మూడ్ లోకి వచ్చేసింది. సీనియర్ ప్లేయర్స్ తో సహా పలువురు స్టార్ క్రికెటర్లందరూ మళ్ళీ గ్రౌండ్ లోకి అడుగుపెట్టారు. బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ తర్వాత 10 రోజులు గ్యాప్ దొరకడంతో రిలాక్సయిన రోహిత్ శర్మ, కోహ్లీ, మిగిలిన టెస్ట్ ప్లేయర్స్ అందరూ న్యూజిలాండ్ తో టెస్ట్ సిరీస్ కోసం ప్రాక్టీస్ లో బిజీబిజీగా ఉన్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 14, 2024 | 08:24 PMLast Updated on: Oct 14, 2024 | 8:24 PM

మళ్ళీ స్పిన్నర్ల హవానే బ

టీమిండియా మళ్ళీ టెస్ట్ ఫార్మాట్ మూడ్ లోకి వచ్చేసింది. సీనియర్ ప్లేయర్స్ తో సహా పలువురు స్టార్ క్రికెటర్లందరూ మళ్ళీ గ్రౌండ్ లోకి అడుగుపెట్టారు. బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ తర్వాత 10 రోజులు గ్యాప్ దొరకడంతో రిలాక్సయిన రోహిత్ శర్మ, కోహ్లీ, మిగిలిన టెస్ట్ ప్లేయర్స్ అందరూ న్యూజిలాండ్ తో టెస్ట్ సిరీస్ కోసం ప్రాక్టీస్ లో బిజీబిజీగా ఉన్నారు. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా బుధవారం నుంచి తొలి టెస్ట్ జరగనుంది. ఈ మ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న బెంగళూరు పిచ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సాధారణంగా బెంగళూరు పిచ్ ఎప్పుడూ ఫ్లాట్ గా ఉంటూ బ్యాటర్లకు అనుకూలిస్తుంది. ఐపీఎల్ లో అయితే ఇక్కడ పరుగుల వరదే. భారత్, కివీస్ తొలి టెస్టుకు మాత్రం స్పిన్ పిచ్ రెడీ చేస్తున్నట్టు సమాచారం. తొలి రెండు రోజులు కాస్త బ్యాటర్లకు, కొంచెం పేస్ బౌలర్లకు అనుకూలించినా… మిగిలిన మూడు రోజులు మాత్రం స్పిన్నర్ల హవానే ఉంటుందని అంచనా వేస్తున్నారు.

గత రికార్డులను చూస్తే ఇప్పటి వరకూ 25 మ్యాచ్ లు జరిగాయి. వీటిలో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 10 సార్లు గెలిస్తే… రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్టు ఐదుసార్లు గెలిచింది.యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ 354 పరుగులుగా ఉంది. ఇక బెంగళూరు స్టేడియంలో హయ్యస్ట్ టెస్ట్ స్కోర్ 626 పరుగులుగా ఉంది. ఇదిలా ఉంటే భారత్ కు ఇక్కడ మంచి రికార్డే ఉంది. 24 మ్యాచ్ లలో 9 సార్లు గెలిచిన భారత్ ఆరింటిలో ఓడిపోయింది. మరో 9 మ్యాచ్ లు డ్రాగా ముగిసాయి. అటు కివీస్ కు మాత్రం ఇక్కడ చెత్త రికార్డుంది. ఆడిన మూడింటిలోనూ పరాజయం పాలైంది.

బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన భారత్ మరోసారి సొంతగడ్డపై ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ బెర్త్ రేసులో దూసుకెళుతున్న టీమిండియా ఇంకా 8 మ్యాచ్ లు ఆడాల్సి ఉండగా.. కనీసం నాలుగింటిలో గెలవాలి. ఈ సిరీస్ లో న్యూజిలాండ్ ను చిత్తు చేసి సిరీస్ ను గెలిస్తే డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్తుకు దాదాపు చేరువవుతుంది. తర్వాత ఆసీస్ పర్యటనలో ఐదు టెస్టులు ఆడాల్సి ఉంటుంది, ఇటీవల బంగ్లాపై ఆడిన జట్టునే సెలక్టర్లు కొనసాగించగా… రిజర్వ్ ప్లేయర్స్ జాబితాలో ఆంధ్రా క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డికి చోటు దక్కింది.