రియాన్ పరాగ్ హీరోయిన్ తో గిల్ ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్

భారత క్రికెట్ లో కోహ్లీ, రోహిత్ తర్వాత శుభమన్ గిల్ బ్రాండ్ వాల్యూ ఓ రేంజ్ లో ఉంది. చూసేందుకు ఫ్యాషన్ మోడల్ లా క్యూట్ గా ఉండే గిల్ తో ఒప్పందాల కోసం టాప్ బ్రాండ్స్ క్యూ కడుతున్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 4, 2024 | 07:45 PMLast Updated on: Sep 04, 2024 | 7:45 PM

రియాన్ పరాగ్ హీరోయిన్ తో

భారత క్రికెట్ లో కోహ్లీ, రోహిత్ తర్వాత శుభమన్ గిల్ బ్రాండ్ వాల్యూ ఓ రేంజ్ లో ఉంది. చూసేందుకు ఫ్యాషన్ మోడల్ లా క్యూట్ గా ఉండే గిల్ తో ఒప్పందాల కోసం టాప్ బ్రాండ్స్ క్యూ కడుతున్నాయి. అతనికి జోడీగా బాలీవుడ్ హీరోయిన్లను యాక్ట్ చేయిస్తూ ప్రమోషన్స్ చేసుకుంటున్నాయి. తాజాగా ప్ర‌ముఖ మొబైల్ హెడ్‌ఫోన్స్ సంస్థ బీట్స్ గిల్‌ను త‌మ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ఎంచుకుంది. గిల్‌తో పాటు బాలీవుడ్ న‌టి అనన్య పాండేను సైతం బీట్స్ త‌మ సంస్థ‌కు అంబాసిడ‌ర్‌గా ఎంపిక చేసుకున్న ఈ సంస్థ వీరిద్దరితో ఫోటో షూట్ చేసింది. బీట్స్ హెడ్ ఫోన్స్‌తో గిల్, అనన్య పాండేలు దిగిన ఫోటోలు వైర‌ల్‌గా మారాయి. జోడీ బాగుందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

అదే సమయంలో అన‌న్య పాండేతో క‌లిసి గిల్ ఫోటోల‌కు ఫోజులు ఇవ్వ‌డం పై స్పందిస్తూ మరో క్రికెటర్ రియాన్ ప‌రాగ్‌ను నెటిజ‌న్లు ట్రోల్ చేస్తున్నారు.
ఐపీఎల్ 2024 సీజ‌న్ ముగిసాక రియాన్ ప‌రాగ్‌.. ఆన్‌లైన్‌ గేమింగ్ లైవ్ స్ట్రీమింగ్ సెష‌న్‌లో పాల్గొన్నాడు. అత‌డి యూట్యూబ్ సెర్చ్ హిస్ట‌రీలో అనన్య పాండే, సారా అలీఖాన్ హాట్ అంటూ క‌నిపించింది. దీన్ని చూసిన నెటిజ‌న్లు షాక్ అయ్యారు. హీరోయిన్ల అందాల కోసం వెతికిన అత‌డు అప్ప‌ట్లోనే ట్రోలింగ్‌కు గురయ్యాడు. తాజాగా గిల్‌తో అన‌న్య ఫోటోలు వైరల్ కావ‌డంతో ఈ విష‌యాన్ని గుర్తు చేసుకుంటూ నెటిజ‌న్లు మ‌రోసారి రియాన్‌ను టీజ్ చేస్తున్నారు.