2 బెర్తులు…3 జట్లు రసవత్తరంగా సెమీస్ రేస్
ఛాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్ ఏ సెమీస్ బెర్తులు మాత్రమే ఖారారయ్యాయి. రెండేసి విజయాలతో భారత్ , న్యూజిలాండ్ సెమీఫైనల్ కు చేరుకున్నాయి.

ఛాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్ ఏ సెమీస్ బెర్తులు మాత్రమే ఖారారయ్యాయి. రెండేసి విజయాలతో భారత్ , న్యూజిలాండ్ సెమీఫైనల్ కు చేరుకున్నాయి. ఇక ఆదివారం ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్ తో గ్రూప్ టాపర్ ఎవరో తేలిపోతుంది. అటు గ్రూప్ బి సెమీస్ రేసు మాత్రం రసవత్తరంగా మారింది. నిన్నటి వరకూ నాలుగు జట్లు రేసులో ఉండగా.. ఇంగ్లాండ్ పై ఆఫ్ఘనిస్తాన్ సంచలన విజయంతో ఇంగ్లీష్ టీమ్ ఇంటిదారి పట్టింది. ప్రస్తుతం గ్రూప్ బి లో మూడు జట్లు రెండు బెర్తుల కోసం రేసులో నిలిచాయి. ఈ మూటింటిలో ఏ రెండైనా సెమీస్ కు రావొచ్చు.
గ్రూప్-బీలో ఆఫ్ఘనిస్తాన్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్ తర్వాత పాయింట్ల పట్టికను పరిశీలిస్తే.. ఇంగ్లాండ్ జట్టు సున్నా పాయింట్లతో అట్టడుగున ఉంది. ఆఫ్ఘనిస్తాన్ 2 మ్యాచ్ లలో ఒక మ్యాచ్ లో విజయం సాధించి పాయింట్ల పట్టికతో మూడో స్థానంలో ఉంది. ఆఫ్ఘనిస్తాన్ నికర రన్ రేట్ -0.990గా ఉంది. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు ఆఫ్ఘనిస్తాన్ కంటే పైన ఉన్నాయి. దక్షిణాఫ్రికా ప్రస్తుతం 3 పాయింట్లతో గ్రూప్-బీలో అగ్రస్థానంలో ఉంది. దక్షిణాఫ్రికా జట్టు నెట్ రన్ రేట్ ప్రస్తుతం +2.140గా ఉండగా… దక్షిణాఫ్రికా తర్వాత రెండో స్థానంలో ఆస్ట్రేలియా 3 పాయింట్లతో కొనసాగుతోంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా నెట్ రన్ రేట్ +0.475గా ఉంటే ప్రస్తుతం ఈ మూడింటిలో ఏదీ సెమీస్ కు క్వాలిఫై కాలేదు.
గ్రూప్-బీలో మిగిలిన మ్యాచ్ ల ప్రకారం.. ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఫిబ్రవరి 28న ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ మ్యాచ్ లో ఏ జట్టు గెలిస్తే వారు నేరుగా సెమీఫైనల్ కు చేరుతారు. అనంతరం మార్చి 1న గ్రూప్-బీలో చివరి మ్యాచ్ లో ఇంగ్లాండ్ దక్షిణాఫ్రికాతో తలపడుతుంది. ఒకవేళ ఆఫ్ఘనిస్తాన్ ఆస్ట్రేలియాను ఓడిస్తే.. దక్షిణాఫ్రికా సెమీఫైనల్ కు చేరుకోవాలంటే ఇంగ్లాండ్ తో జరిగే మ్యాచ్ లో కూడా గెలవాలి. మరోవైపు ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్ పై గెలిస్తే.. దక్షిణాఫ్రికా ఆడకుండానే సెమీఫైనల్ కు చేరుకుంటుంది. కాగా శుక్రవారం గ్రూప్ బిలో తొలి సెమీస్ బెర్త్ ఖరారు కానుంది. ఆస్ట్రేలియా, ఆప్ఘనిస్తాన్ మధ్య పోరు హోరాహోరీగానే సాగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆప్ఘన్ టీమ్ ను కంగారూలు కూడా తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు.