2024, ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కు గోల్డెన్ ఇయర్
2024 లో క్రికెట్ అభిమానులకు ఒకరకంగా పండగ వాతావరణం అని చెప్పాలి. గత ఏడాది రోహిత్ శర్మ కెప్టెన్సీ లో ప్రపంచ కప్ అలాగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఓడిపోయిన భారత జట్టు కరేబియన్ దీవులలో జరిగిన టి20 వరల్డ్ కప్ గెలిచేసి సంచలనాలు సృష్టించింది. సౌత్ ఆఫ్రికా పై తక్కువ స్కోరు చేసినా... భారత్ వ్యూహాత్మకంగా విజయం సాధించి రెండోసారి టి20 ప్రపంచకప్ అందుకుంది.
2024 లో క్రికెట్ అభిమానులకు ఒకరకంగా పండగ వాతావరణం అని చెప్పాలి. గత ఏడాది రోహిత్ శర్మ కెప్టెన్సీ లో ప్రపంచ కప్ అలాగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఓడిపోయిన భారత జట్టు కరేబియన్ దీవులలో జరిగిన టి20 వరల్డ్ కప్ గెలిచేసి సంచలనాలు సృష్టించింది. సౌత్ ఆఫ్రికా పై తక్కువ స్కోరు చేసినా… భారత్ వ్యూహాత్మకంగా విజయం సాధించి రెండోసారి టి20 ప్రపంచకప్ అందుకుంది. ఆ మ్యాచ్లో విరాట్ కోహ్లీ, అక్షర్ పటేల్ బ్యాటింగ్ లో రాణించగా ఆ తర్వాత బౌలింగ్లో బూమ్రా మంచి ప్రదర్శన చేయడంతో భారత్ విజయాన్ని అందుకుంది.
ఇక ఆ మ్యాచ్ తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ అలాగే సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీ టీ20 లకు గుడ్ బై చెప్పారు. ఆ తర్వాత మరో సంచలనం… భారత్ న్యూజిలాండ్ చేతిలో వైట్ వాష్ కు గురి కావడం. మూడు టెస్ట్ మ్యాచ్ ల సీరిస్ లో న్యూజిలాండ్ చేతిలో భారత్ ఘోరంగా ఓడిపోయింది. బ్యాటింగ్ బౌలింగ్ విభాగాల్లో ఘోరంగా విఫలమైన భారత్ న్యూజిలాండ్ చేతులో ఓటమిపాలై వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు వెళ్లే అవకాశాలను కఠినతరం చేసుకుంది. బంగ్లాదేశ్ పై మంచి విజయాలు నమోదు చేసిన భారత జట్టు న్యూజిలాండ్ పై ఆ రేంజ్ లో ఓడిపోతుందని ఎవరూ ఊహించలేదు.
ఇక ఆస్ట్రేలియా పర్యటనకు బయలుదేరిన భారత జట్టు మొదటి టెస్ట్ లో ఘనవిజయం సాధించింది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ దూరంగా ఉండటంతో బౌలింగ్ కెప్టెన్ బూమ్రా భారత్ కు సారధిగా వ్యవహరించాడు. ఆ మ్యాచ్లో భారత్ 295 పరుగులు తేడాతో పెర్త్ లో ఘనవిజయం సాధించేసి ఆస్ట్రేలియాకు షాక్ ఇచ్చింది. అయితే ఆ తర్వాత రెండో టెస్టులో భారత్ ఘోరంగా ఓడిపోయింది. మూడో టెస్ట్ కోసం ప్రస్తుతం సిద్ధమవుతోంది. ఇప్పుడు భారత్ వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ కు చేరాలి అంటే రాబోయే మూడు మ్యాచ్ల్ లలో విజయం సాధించాల్సి ఉంది.
వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ గెలిచి క్రికెట్ కు గుడ్ బై చెప్పాలని భావిస్తున్నాడు రోహిత్ శర్మ. మరి జట్టును ఎంతవరకు విజయ పదం లో నడిపిస్తాడనే దాపైన ఆధారపడి ఉంది. ఈ ఏడాది ప్రపంచ క్రికెట్లో భారత్ మినహా మరే జట్టు కూడా ఈ స్థాయిలో సంచలనాలు నమోదు చేయలేదు. ఇక పాకిస్తాన్ పై బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్ విజయం కాస్త సంచలనమైంది. అలాగే ఇంగ్లాండ్ పాకిస్తాన్ పర్యటనకు వచ్చిన సందర్భంగా మొదటి ట్రస్టులో నమోదు చేసిన స్కోర్లు కూడా హాట్ టాపిక్ అయ్యాయి. ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు జొ రూట్… ఈ ఏడాది అత్యంత భీకర హోం లో ఉన్నాడు. టీమిండియా ఓపెనర్ యశస్వి జైష్వాల్ కూడా ఏడాది మంచి ఫామ్ లో ఉన్నాడు. ఏడాది మొదట్లో జరిగిన ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ లో మంచి ప్రదర్శన చేశాడు జైష్వాల్. ఆస్ట్రేలియా పర్యటంలో కూడా మొదటి టెస్ట్ లో 161 పరుగులు చేసి ఆస్ట్రేలియాకు సవాల్ విసిరాడు.