KKR : కోల్‌కతా జట్టులోకి డాషింగ్ క్రికెటర్
ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి ముందు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫ్రాంచైజీ ఓ విధ్వంసకర ఆటగాడిని జట్టులోకి చేర్చుకుంది. వ్యక్తిగత కారణాల చేత రాబోయే సీజన్‌కు దూరంగా ఉండనున్న ఇంగ్లండ్ ఆటగాడు జేసన్ రాయ్ స్థానాన్ని అదే దేశానికి చెందిన ఫిల్ సాల్ట్‌తో భర్తీ చేసింది.

A dashing cricketer into the Kolkata team
ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి ముందు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫ్రాంచైజీ ఓ విధ్వంసకర ఆటగాడిని జట్టులోకి చేర్చుకుంది. వ్యక్తిగత కారణాల చేత రాబోయే సీజన్‌కు దూరంగా ఉండనున్న ఇంగ్లండ్ ఆటగాడు జేసన్ రాయ్ స్థానాన్ని అదే దేశానికి చెందిన ఫిల్ సాల్ట్‌తో భర్తీ చేసింది. గత సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడిన సాల్ట్‌ను కేకేఆర్ మేనేజ్‌మెంట్ 1.5 కోట్ల రిజర్వ్ ధరకు సొంతం చేసుకుంది. 2024 సీజన్ వేలంలో సాల్ట్ అన్ సోల్డ్‌గా మిగిలిపోయాడు. కాగా, 27 ఏళ్ల ఫిల్ సాల్ట్‌కు విధ్వంసకర ఆటగాడిగా పేరుంది. ఇంగ్లండ్ తరఫున, లీగ్ క్రికెట్‌లో ఇతను మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడాడు. సాల్ట్‌కు ఐపీఎల్‌లోనూ ఓ మోస్తరు రికార్డు ఉంది. ఐపీఎల్ లో 9 మ్యాచ్‌లు ఆడి 2 హాఫ్ సెంచరీలు చేశాడు.