India New Captain : కొత్త ఏడాదిలో భారత్‌కు కొత్త కెప్టెన్ ?
సఫారీ పర్యటనలో బిజీగా ఉన్న భారత క్రికెట్ జట్టు కొత్త ఏడాదిలో వరుస సిరీస్‌లు ఆడబోతోంది. స్వదేశంలో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అఫ్గానిస్తాన్‌తో తలపడనుంది. జనవరి 11 నుంచి జరగనున్న ఈ వైట్‌బాల్ సిరీస్‌కు త్వరలోనే జట్టును ప్రకటించనున్నారు. అయితే అఫ్గాన్ సిరీస్‌లో భారత జట్టు సారథిగా ఎవరు పగ్గాలు చేపడతారన్నది సందిగ్ధత నెలకొంది. టీ ట్వంటీ ఫార్మాట్‌కు గత కొంతకాలంగా హార్థిక్ పాండ్యా లేకుంటే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు.

A new captain for India in the new year?
సఫారీ పర్యటనలో బిజీగా ఉన్న భారత క్రికెట్ జట్టు కొత్త ఏడాదిలో వరుస సిరీస్‌లు ఆడబోతోంది. స్వదేశంలో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అఫ్గానిస్తాన్‌తో తలపడనుంది. జనవరి 11 నుంచి జరగనున్న ఈ వైట్‌బాల్ సిరీస్‌కు త్వరలోనే జట్టును ప్రకటించనున్నారు. అయితే అఫ్గాన్ సిరీస్‌లో భారత జట్టు సారథిగా ఎవరు పగ్గాలు చేపడతారన్నది సందిగ్ధత నెలకొంది. టీ ట్వంటీ ఫార్మాట్‌కు గత కొంతకాలంగా హార్థిక్ పాండ్యా లేకుంటే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ గాయాలతో అందుబాటులో లేరు. వన్డే ప్రపంచకప్‌లో గాయపడిన హార్థిక్ కోలుకుని తిరిగి గ్రౌండ్‌లో అడుగుపెట్టేందుకు మరికొన్నాళ్లు పడుతుంది. అలాగే సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి కూడా ఇదే. ఇక ఆసియా క్రీడల్లో జట్టును లీడ్ చేసిన రుతురాజ్ కూడా ఇప్పట్లో కోలుకునే పరిస్థితి లేదు. దీంతో సారథ్య బాధ్యతలు ఎవరికి అప్పగించాలనే దానిపై బీసీసీఐ సెలక్షన్ కమిటీ తర్జనభర్జన పడుతోంది.
టీమిండియా రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మను కూడా దీనిపై బీసీసీఐ ఛీప్ సెలక్టర్ అజిత్ అగార్కర్ చర్చించినట్టు సమాచారం. ఆప్ఘనిస్తాన్‌తో సిరీస్‌కు సారథిగా ఉండాలని కోరగా.. తన నిర్ణయం చెప్పేందుకు రోహిత్ టైమ్ అడిగినట్టు వార్తలు వచ్చాయి. ఒక వేళ రోహిత్ అందుకు అంగీకరించకపోతే.. అఫ్గాన్ సిరీస్‌లో మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ అప్పగించాలని సెలక్షన్ కమిటీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. శ్రేయాస్‌కు సారథిగా మంచి అనుభవమే ఉంది. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, కేకేఆర్ జట్లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. దక్షిణాఫ్రికాతో టీ ట్వంటీ అదరగొట్టిన అయ్యర్.. ఇప్పుడు టెస్టుల్లోనూ సత్తా చాటుతున్నాడు. ఇదిలా ఉంటే టీ ట్వంటీ వరల్డ్‌కప్‌కు ముందు ఆడే చివరి టీ ట్వంటీ సిరీస్‌లో రెగ్యులర్ కెప్టెన్ అందుబాటులో లేకపోవడం భారత్‌కు ఎదురుదెబ్బగానే చెప్పాలి.