మెగాటోర్నీలో దంచికొట్టాడు ఆఫ్ఘన్ బ్యాటర్ నయా హిస్టరీ
గత కొన్నేళ్ళుగా ప్రపంచ క్రికెట్ లో ఆఫ్ఘనిస్తాన్ తనదైన ముద్ర వేస్తోంది. ముఖ్యంగా ఐసీసీ టోర్నీల్లో అద్భుతంగా ఆడుతోంది. స్వదేశంలో పరిస్థితులు ఎలా ఉన్నా క్రికెట్ ను ప్రాణంగా ప్రేమిస్తూ ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్ళ వరల్డ్ క్రికెట్ లో అదరగొడుతున్నారు.

గత కొన్నేళ్ళుగా ప్రపంచ క్రికెట్ లో ఆఫ్ఘనిస్తాన్ తనదైన ముద్ర వేస్తోంది. ముఖ్యంగా ఐసీసీ టోర్నీల్లో అద్భుతంగా ఆడుతోంది. స్వదేశంలో పరిస్థితులు ఎలా ఉన్నా క్రికెట్ ను ప్రాణంగా ప్రేమిస్తూ ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్ళ వరల్డ్ క్రికెట్ లో అదరగొడుతున్నారు. రషీద్ ఖాన్, మహ్మద్ నబీ, అజ్మతుల్లా, జద్రాన్ వంటి ప్లేయర్స్ టాప్ టీమ్స్ పై సత్తా చాటుతున్నారు. ఈ క్రమంలో ఆఫ్ఘనిస్తాన్ యువ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ వేదికగా రికార్డుల మోత మోగించాడు. ఇంగ్లాండ్ తో మ్యాచ్ లో సెంచరీ ఇన్నింగ్స్ ఆడిన జద్రాన్ పదుల కొద్దీ రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆరంభంలోనే 3 కీలక వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో ఉన్న దశలో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొని సెంచరీ బాదాడు. ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ మాత్రం చాలా జాగ్రత్తగా ఆడాడు. సమయోచితంగా ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. అతడికి హష్మాతుల్లా షాహిది మంచి సహకారం అందించాడు. దీంతో నాలుగో వికెట్ కు 50 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. అనంతరం శతక భాగస్వామ్యం కూడా నెలకొల్పారు.ఈ క్రమంలోనే ఓపెనర్ వచ్చిన ఇబ్రహీం జద్రాన్ 106 బంతుల్లో శతకం నమోదు చేశాడు. 3 సిక్సులు, 6 ఫోర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు.
తద్వారా ఛాంపియన్స్ ట్రోఫీలోనే అఫ్ఘానిస్థాన్ బ్యాటర్లలో శతకం బాదిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. వన్డేల్లో అతడికి ఇది ఆరో సెంచరీ. జద్రాన్.. కెప్టెన్ హష్మతుల్లా షాహిది, అజ్మతుల్లా ఒమర్‌జాయ్, మహ్మద్ నబీతో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పి ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. సెంచరీ వరకు ఆచితూచి ఆడిన జద్రాన్.. ఆతర్వాత శివాలెత్తిపోయాడు. ఎడాపెడా బౌండరీలు బాది ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ సెంచరీతో జద్రాన్ మరో రెండు భారీ రికార్డులు కూడా సాధించాడు. వన్డేల్లో ఆఫ్ఘనిస్తాన్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఈ రికార్డు గతంలో కూడా జద్రాన్ పేరిటే ఉండేది. జద్రాన్ తన రికార్డును తనే సవరించుకున్నాడు. 2022లో శ్రీలంకతో జరిగిన వన్డేలో జద్రాన్ 162 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌కు ముందు వరకు వన్డేల్లో ఆఫ్ఘనిస్తాన్ తరఫున ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోర్‌గా ఉంది. అలాగే రెండు ఐసీసీ వన్డే ఈవెంట్లలో సెంచరీలు చేసిన తొలి ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. జద్రాన్.. వన్డే వరల్డ్‌కప్‌లో, ఛాంపియన్స్ ట్రోఫీలో సెంచరీలు చేశాడు. జద్రాన్.. 2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియాపై సూపర్ సెంచరీతో మెరిశాడు. ముంబైలో జరిగిన ఆ మ్యాచ్‌లో జద్రాన్ 129 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
ఈ రికార్డులతో పాటు జద్రాన్ మరో ఘనత కూడా సాధించాడు. పాక్ గడ్డపై నాలుగో అత్యధిక వన్డే స్కోర్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. పాక్ గడ్డపై వన్డేల్లో అత్యధిక స్కోర్ చేసిన ఘనత గ్యారీ కిర్‌స్టన్‌కు దక్కుతుంది. 1996 వరల్డ్‌కప్‌లో కిర్‌స్టన్ యూఏఈపై 188 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ఆటగాడిగానూ నిలిచాడు. ఈ క్రమంలో బెన్ డకెట్ , నాథన్ ఆస్టల్ , ఆండీ ఫ్లవర్ , సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్, గ్రేమీ స్మిత్ స్కోర్లను దాటేశాడు. ఇబ్రహీం జద్రాన్ కు మిస్టర్ ఐసీసీగా పేరుంది. 2023 వన్డే ప్రపంచకప్ లోనూ ఆస్ట్రేలియా అద్భుతమైన సెంచరీతో అందరినీ ఆకట్టుకున్నాడు. కాగా ప్రస్తుత ఛాంపియన్స్ ట్రోఫీ కీలక మ్యాచ్ లో జద్రాన్ అద్భుతమైన ఇన్నింగ్స్ తో ఆఫ్ఘనిస్తాన్ 325 పరుగుల భారీస్కోర్ చేసింది.