రికార్డుల రూట్ టెస్టుల్లో అరుదైన ఘనత

ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ రెడ్ బాల్ క్రికెట్ లో తన ఆధిపత్యం కొనసాగిస్తున్నాడు. టెస్టుల్లో అత్యంత నిలకడగా రాణిస్తూ పరుగుల వరద పారిస్తున్న రూట్ తాజాగా మరో రికార్డు అందుకున్నాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 9, 2024 | 02:25 PMLast Updated on: Sep 09, 2024 | 2:25 PM

A Rare Feat In Record Route Tests

ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ రెడ్ బాల్ క్రికెట్ లో తన ఆధిపత్యం కొనసాగిస్తున్నాడు. టెస్టుల్లో అత్యంత నిలకడగా రాణిస్తూ పరుగుల వరద పారిస్తున్న రూట్ తాజాగా మరో రికార్డు అందుకున్నాడు. టెస్ట్ క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన ఆరో బ్యాటర్ గా రికార్డు సృష్టించాడు. శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టులో రూట్ సంగక్కరా రికార్డును దాటేశాడు. ఈ ఇంగ్లాండ్ బ్యాటర్ మరో 71 పరుగులు చేస్తే అలెస్టర్ కుక్ పేరిట ఉన్న 12,472 రన్స్ రికార్డును కూడా అధిగమిస్తాడు. ప్రస్తుతం టెస్ట్ క్రికెట్ లో అత్యధిక పరుగుల రికార్డు సచిన్ పేరిట ఉంది. టెస్టుల్లో సచిన్ 15 వేల 921 పరుగులు చేశాడు.