జైషాకు అరుదైన గౌరవం ,కీలక కమిటీలో చోటు
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఛైర్మన్ జై షాకు అరుదైన గౌరవం దక్కింది. కొత్తగా ఏర్పాటైన వరల్డ్ క్రికెట్ కనెక్ట్స్ సలహా మండలిలో జై షాకు చోటు కల్పించారు.
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఛైర్మన్ జై షాకు అరుదైన గౌరవం దక్కింది. కొత్తగా ఏర్పాటైన వరల్డ్ క్రికెట్ కనెక్ట్స్ సలహా మండలిలో జై షాకు చోటు కల్పించారు. క్రికెట్‌లో ఎదురయ్యే సవాళ్లు, అవకాశాలపై చర్చించేందుకు మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ ఈ స్వతంత్ర బోర్డును ఏర్పాటు చేసింది. ఈ బోర్డులో ప్రస్తుత కెప్టెన్‌లు, మాజీ క్రికెటర్లు, అధికారిక బ్రాడ్‌కాస్టర్స్ ప్రతినిధులు సహా పలువురికి చోటిచ్చారు. భారత్ నుంచి మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, ఐసీసీ సీసీఓ అనురాగ్ దహియా, జియో స్టార్ సీఈఓ సంజోగ్ గుప్తాలకు చోటు దక్కింది.వీరితో పాటు కుమార సంగక్కర, క్రిస్ డెహ్రింగ్, మెల్ జోన్స్, హీథర్ నైట్, ట్రుడీ లిండ్‌బ్లేడ్, హీత్ మిల్స్, ఇంతియాజ్ పటేల్, గ్రేమ్ స్మిత్, ఆండ్రూ స్ట్రాస్ డబ్ల్యూసీసీలో సభ్యులుగా ఉన్నారు. ఎంసీసీ వరల్డ్ క్రికెట్ కమిటీ స్థానంలో ఈ డబ్ల్యూసీసీని తీసుకొచ్చారు. గతంలో ఎంసీసీ వరల్డ్ క్రికెట్ కమిటీ చేసిన పనులు ఇక నుంచి డబ్ల్యూసీసీ ద్వారా చేయనున్నారు.