అత్త చేతిలో ధోని వ్యాపార సామ్రాజ్యం వేల కోట్లను హ్యాండిల్ చేయనున్న షీలా సింగ్

టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ గురించి తెలియనివారుండరు.. భారత జట్టును విజయపథంలో నడిపి.. క్లిష్ట సమయంలోనూ జట్టుకు విజయాలను అందించి మిస్టర్‌ కూల్‌గా పేరు తెచ్చుకున్నారు.. అన్ని ఫార్మాట్‌లకు గుడ్‌బై చెప్పినా.. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఇంకా సత్తా చాటుతూనే ఉన్నారు.. 41 ఏళ్ల వయసులో చెన్నై సూపర్‌కింగ్స్‌ను ఐదోసారి చాంపియన్‌గా నిలిపి.. అసలు ధోనీ లేకుండా ఐపీఎల్‌ లేదా? అనేలా అభిమానులను సొంతం చేసుకున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 22, 2023 | 03:11 PMLast Updated on: Jun 22, 2023 | 3:11 PM

A Report Says That Dhoni Is Transferring His Businesses To His Aunt Sheela Singh

ఓవైపు క్రికెట్‌ మరోవైపు వ్యాపారం.. కొన్ని బ్రాండ్లకు అంబాసిడర్‌.. ఇలా రెండు చేతులా సంపాదిస్తున్నారు జార్ఖండ్‌ డైనమైట్‌.. అయితే, మన మహేంద్రుడి వ్యాపార సామ్రాజ్యం మొత్తం తనకు పిల్లను ఇచ్చిన అత్త చేతిలో పెట్టారట ధోనీ. ఓవైపు సంపాదిస్తూనే మరోవైపు.. పలు వ్యాపార సంస్థలలో పెట్టుబడులు పెట్టారు ధోనీ.. వినోద రంగంలోనూ ఎంట్రీ ఇచ్చారు.. ధోనీ ఎంటర్టైన్‌మెంట్‌ లిమిటెడ్‌ పేరిట ప్రొడక్షన్‌ హౌజ్‌ ఏర్పాటు చేశాడు. అయితే, ఆ సంస్థ బాధ్యతలు మొత్తం తనకు పిల్లనిచ్చిన అత్త చేతిలో పెట్టారు.. ఆ కంపెనీకి చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా మిస్టర్‌ కూల్‌ యొక్క అత్త షీలా సింగ్‌ అట! ఓ నివేదిక ప్రకారం.. తన ప్రొడక్షన్‌ హౌజ్‌లో కుటుంబ సభ్యులకు పెద్దపీట వేయాలని భావించిన ధోనీ.. భార్య సాక్షి సింగ్‌, ఆమె తల్లి షీలా సింగ్‌కు బాధ్యతలు అప్పగించాడు.

కాగా, సౌత్‌లో తన బ్యానర్‌పై పలు చిత్రాలను నిర్మిస్తున్న ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్ లిమిటెడ్ విలువ దాదాపు 800 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ఈ కంపెనీలో సాక్షి అతిపెద్ద షేర్ హోల్డర్ అని సమాచారం.అయితే, సాక్షి తండ్రి ఆర్కే సింగ్, ధోనీ తండ్రి పాన్ సింగ్ గతంలో ఒకే స్థలంలో కలిసి పనిచేశారు. బినాగురి అనే టీ కంపెనీలో వీరు సహచరులుగా ఉన్నట్లు తెలుస్తోంది.. అప్పట్లో గృహిణిగా ఉన్న షీలా సింగ్.. అల్లుడు ధోనీ కోరిక మేరకు కూతురితో కలిసి వ్యాపారవేత్తగా మారినట్లు ఆ నివేదిక చెబుతోంది.. ఇక, చాలా నివేదికల్లో మిస్టర్‌ కూల్ ధోని నికర ఆస్తుల విలువ దాదాపు 1030 కోట్లుగా అంచనా వేస్తున్నారు.. కాగా, ఐపీఎల్‌లో సీఎస్‌కే కెప్టెన్‌గా ఉన్న ధోనీ ఇప్పటి వరకు ఐదుసార్లు ట్రోఫీని జట్టుకు అందించాడు. 2020 ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మిస్టర్ కూల్.. ఐపీఎల్‌లో మాత్రం కొనసాగుతూ వస్తున్న విషయం విదితమే.