పోటెత్తిన అభిమానం, మెల్‌బోర్న్ లో రికార్డులు బద్దలు
ప్రపంచ క్రికెట్ లో రెండు అత్యుత్తమ జట్లు తలపడితే అభిమానులకు అంతకుమించిన కిక్ మరేముంటుంది... అందులోనూ ఇయర్ ఎండింగ్.. క్రిస్ మస్ హాలిడేస్... ఇక వేరే చెప్పాలా... పైగా మ్యాచ్ జరుగుతోంది భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య... అది కూడా ప్రతిష్టాత్మక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ప్రతీ మ్యాచ్ రసవత్తరమే..
ప్రపంచ క్రికెట్ లో రెండు అత్యుత్తమ జట్లు తలపడితే అభిమానులకు అంతకుమించిన కిక్ మరేముంటుంది… అందులోనూ ఇయర్ ఎండింగ్.. క్రిస్ మస్ హాలిడేస్… ఇక వేరే చెప్పాలా… పైగా మ్యాచ్ జరుగుతోంది భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య… అది కూడా ప్రతిష్టాత్మక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ప్రతీ మ్యాచ్ రసవత్తరమే.. అందుకే బాక్సింగ్ డే టెస్టుకూ అభిమానులు పోటెత్తారు. ఈ క్రమంలో గత రికార్డులన్నీ గల్లంతయ్యాయి. గెలిచే అవకాశాలు ఇరు జట్లకు సమానంగా ఉండటంతో సోమవారం ఒక్కరోజే 66వేలకు పైగా ప్రేక్షకులు మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌కు తరలివచ్చారు. దాంతో మెల్‌బోర్న్ టెస్ట్‌కు హాజరైన మొత్తం ప్రేక్షకుల సంఖ్య 3,50,000 దాటింది. తద్వారా నాలుగో టెస్ట్ కొత్త రికార్డులు సృష్టించింది.
దిగ్గజ బ్యాటర్ సర్ డొనాల్డ్ బ్రాడ్ మన్ క్రికెట్ ఆడుతున్నప్పుడే ఈ సంఖ్యలో జనం స్టేడియాలకు పోటెత్తేవారు. 1937 యాషెస్ సిరీస్ సందర్భంగా ఈ ఫీట్ పీక్స్ కు చేరుకుంది. ఆ టెస్టుకు 350,535 మంది హాజరై, అత్యధిక మంది హాజరైన బాక్సింగ్ డే టెస్టుగా చరిత్ర పుటల్లో నిలిచి పోయింది. తాజాగా భారత్, ఆసీస్ మ్యాచ్ కు అంతకు 165 మంది ఎక్కువ మందే హాజరై ఆ రికార్డును బద్దలు కొట్టారు. ఇక సోమవారం టికెట్టు రేటును పది ఆస్ట్రేలియన్ డాలర్ల కనీస మొత్తానికి నిర్ణయించడం కూడా కలిసొచ్చింది.
ఈ టెస్టు తొలి రోజున అత్యధిక సంఖ్యలో ఫ్యాన్స్ హాజరయ్యారు. ఏకంగా 87, 242 మంది ప్రేక్షకులు మైదానానికి వచ్చారు. రెండో రోజు 85,147 మంది, మూడో రోజున 83,073 మంది హాజరవగా, ఆదివారం అకస్మాత్తుగా ఈ సంఖ్య 43, వేల 67 మందికి పడిపోయింది. అయితే చివరిరోజు 51, 371 మంది హాజరవ్వడంతో పాత రికార్డు బద్దలైంది. ఒక టెస్టులో అత్యధిక మంది హాజరైన రికార్డు మనదేశంలోనే జరిగింది. 1999లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ ల మధ్య కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన టెస్టు మ్యాచ్ కు 465,000 మంది హాజరవడంతో ప్రపంచ రికార్డు నమోదైంది. ఇప్పట్లో ఈ రికార్డును దాటడం అసాధ్యమే.
మెల్‌బోర్న్ టెస్టు ఈ స్థాయిలో ప్రేక్షకాదరణ పొందడానికి భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, ఆసీస్ యువ ఆటగాడు సామ్ కొంటాస్ మధ్య జరిగిన గొడవే కారణమని చెప్పొచ్చు. ఈ గొడవ జరిగిన మరుసటి ఆసీస్ మీడియాలో వచ్చిన కథనాలూ ఆసీస్ అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచాయని చెప్పుకోవాలి. మొత్తం మీద మెల్ బోర్న్ బాక్సింగ్ డే టెస్ట్ క్రికెట్ లో ప్రత్యేకంగా నిలిచిపోయింది.