భారత్ లేకుండా టోర్నీనా ? పాక్ బోర్డుకు షాకిచ్చిన ఐసీసీ
ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ఐసీసీ దిమ్మతిరిగే షాకిచ్చింది. ఆతిథ్య దేశ హోదాలో ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్న పాక్ క్రికెట్ బోర్డుకు వార్నింగ్ ఇచ్చింది. భారత్ జట్టు లేకుండా టోర్నీ నిర్వహణ అసాధ్యమని తేల్చేసింది.
ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ఐసీసీ దిమ్మతిరిగే షాకిచ్చింది. ఆతిథ్య దేశ హోదాలో ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్న పాక్ క్రికెట్ బోర్డుకు వార్నింగ్ ఇచ్చింది. భారత్ జట్టు లేకుండా టోర్నీ నిర్వహణ అసాధ్యమని తేల్చేసింది. టీమిండియా ఆడకుంటే మెగా టోర్నీ అట్టర్ ఫ్లాప్ అవుతుందని పీసీబీకి క్లారిటీ ఇచ్చేసింది. హైబ్రిడ్ మోడల్ కు ఒప్పుకోవాల్సిందేనని పాక్ క్రికెట్ బోర్డుకు ఐసీసీ తేల్చి చెప్పేసింది. హైబ్రిడ్ మోడల్ కు ససేమీరా అంటూ పనికిమాలిన స్టేట్ మెంట్లు ఇవ్వొద్దని ఐసీసీ పెద్దలు పాక్ క్రికెట్ బోర్డుకు గట్టి వార్నింగే ఇచ్చినట్టు అర్థమవుతోంది. పాకిస్థాన్ తో ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్న తర్వాత గత 15 ఏళ్ళుగా భారత్ ఆ దేశంలో పర్యటించడం లేదు. కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే టీమిండియా, పాక్ జట్టుతో మ్యాచ్ లు ఆడుతోంది. అయితే వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ ఆతిథ్యమిస్తుండగా.. టోర్నీలో పాల్గొనే జట్లలో భారత్ కూడా ఉంది.
మిగిలిన దేశాలు అక్కడికి వెళ్ళేందుకు అంగీకరించగా.. భారత్ మాత్రం ఎట్టపరిస్థితుల్లోనూ పాక్ వచ్చి ఆడేది లేదని తేల్చి చెప్పింది. తమ మ్యాచ్ లు హైబ్రిడ్ మోడల్ తరహాలో తటస్థ వేదికగా నిర్వహించాలని ఐసీసీని కోరింది. దీనికి ఐసీసీ సానుకూలంగా ఉన్నప్పటకీ పాక్ క్రికెట్ బోర్డు మాత్రం ఓవరాక్షన్ చేస్తోంది. భారత్ ను బెదిరించేందుకు కూడా ప్రయత్నించి విఫలమై ఇప్పుడు విమర్శలు గుప్పిస్తోంది. అన్ని దేశాలు వస్తున్నప్పుడు భారత్ ఎందుకు రాదంటూ ప్రశ్నించడం, దీనికి బీసీసీఐ కూడా గట్టి కౌంటర్ ఇవ్వడంతో పీసీబీకి ఏం చేయాలో పాలుపోవడం లేదు. అదే సమయంలో షెడ్యూల్ ప్రకటనపై ఒత్తిడి పెరిగింది. ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించాల్సి ఉండగా… భారత్ రాదని తేలిపోవడంతో మరో టీమ్ ను రీప్లేస్ చేసి టోర్నీని నిర్వహించేందుకు కూడా ప్రయత్నాలు చేసింది. అయితే ఐసీసీ మాత్రం పాక్ క్రికెట్ బోర్డు ఓవరాక్షన్ కు చెక్ పెట్టింది.
భారత జట్టు లేకుండా ఛాంపియన్స్ ట్రోఫీ ఎట్టిపరిస్థితుల్లోనూ జరగదని పీసీబీకి చెప్పేసింది. ఈ విషయంలో ఎక్కువ ఆలోచించకుండా హైబ్రిడ్ మోడల్ కు ఒప్పుకోవాలని కాస్త గట్టిగానే చెప్పినట్టు సమాచారం. టీమిండియా లేకుండా టోర్నీ జరిగితే అన్ని విధాలా నష్టపోతామని , ఇప్పటికే టీ ట్వంటీ ప్రపంచకప్ తో నష్టాలు చవిచూశామంటూ ఐసీసీ గుర్తు చేసినట్టు తెలుస్తోంది.ప్రపంచ క్రికెట్ లో అగ్రశ్రేణి జట్టు లేకుండా ఇలాంటి మెగా టోర్నీ నిర్వహణ ఎప్పుడూ సాధ్యం కాదని ఐసీసీ పీసీబీకి క్లియర్ గా చెప్పేయడంతో ఇప్పుడు పాక్ బోర్డు ఆత్మరక్షణలో పడింది. ఇక అన్నీ మూసుకుని హైబ్రిడ్ మోడల్ కు పాక్ బోర్డు ఓకే చెప్పాల్సిందే. దీని ప్రకారం భారత్ ఆడే మ్యాచ్ లు యుఏఈ వేదికగా నిర్వహించే ఛాన్సుంది. ఒకవేళ పాక్ క్రికెట్ బోర్డు తోక జాడిస్తే మాత్రం ఛాంపియన్స్ ట్రోఫీని సౌతాఫ్రికాలో నిర్వహించేందుకు ఐసీసీ ప్లాన్ బితో రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది.