నమ్మిన స్నేహితుడే నమ్మకద్రోహం, పడిలేచిన కెరటంలా డీకే కెరీర్

ప్రతి మనిషికీ జీవితంలో ఆటుపోట్లు, ఎదురుదెబ్బలు ఎదురవుతూనే ఉంటాయి... వాటిలో కొన్ని మాత్రం మనసుగా తగిలితే అంత తేలిగ్గా కోలుకోలేరు... మరీ ముఖ్యంగా పెళ్ళి చేసుకున్న భార్య, తన స్నేహితుడితో కలిసి నమ్మకద్రోహం చేస్తే అంతకంటే దారుణమైన గాయం మరొకటి ఉండదు... ఇలాంటి పరిస్థితినే వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్నాడు భారత క్రికెటర్ దినేశ్ కార్తీక్.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 4, 2024 | 04:28 PMLast Updated on: Dec 04, 2024 | 4:28 PM

A Trusted Friend Betrayed Dks Career Is Like A Crashing Wave

ప్రతి మనిషికీ జీవితంలో ఆటుపోట్లు, ఎదురుదెబ్బలు ఎదురవుతూనే ఉంటాయి… వాటిలో కొన్ని మాత్రం మనసుగా తగిలితే అంత తేలిగ్గా కోలుకోలేరు… మరీ ముఖ్యంగా పెళ్ళి చేసుకున్న భార్య, తన స్నేహితుడితో కలిసి నమ్మకద్రోహం చేస్తే అంతకంటే దారుణమైన గాయం మరొకటి ఉండదు… ఇలాంటి పరిస్థితినే వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్నాడు భారత క్రికెటర్ దినేశ్ కార్తీక్… ఒకదశలో పిచ్చోడిలా మారిపోయి ఆత్మహత్య తప్ప మరొక పరిష్కారం లేదని కూడా అనుకుని ఆ ప్రయత్నమూ చేశాడు. కానీ కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుందన్న రీతిలో ఎవరైతే దూరమయ్యారో అదే స్థానంలో మరొకరు అండగా నిలిచారు. ఆమె స్ఫూర్తితో , ప్రోత్సాహంతో దారుణమైన పరిస్థితి నుంచి కోలుకుని అంతర్జాతీయ స్టార్ క్రికెటర్ గా ఎదిగాడు టీమిండియా మాజీ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్…

దినేశ్ కార్తీక్ జీవితం ప్రతీ ఒక్కరికి స్ఫూర్తి దాయకం అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. దినేశ్ కార్తీక్ రీఎంట్రీ ఇచ్చినట్లు ప్రపంచంలో మరే క్రికెటర్ కూడా కమ్ బ్యాక్ ఇవ్వలేదు. ధోనీ రాకతో టీమిండియా అవకాశాలు సన్నగిల్లగా.. వ్యక్తిగత జీవితంలో కట్టుకున్న భార్య, ప్రాణ స్నేహితుడు దారుణంగా మోసం చేశారు. దాంతో అతను పిచ్చోడిలా మారిపోయాడు. అయితే దీపిక్ పల్లికల్ అందించిన ప్రేమ అతన్న బౌన్స్ బ్యాక్ అయ్యేలా చేసింది. దినేశ్ కార్తీక్ టీమిండియా సెకండ్ వికెట్ కీపర్‌గా తమిళనాడు కెప్టెన్‌గా అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న ‌టైమ్‌లో అతని టీమ్‌మేట్ మురళీ విజయ్.. కార్తీక్ మొదటి భార్య నిఖితతో ఎఫైర్ పెట్టుకున్నాడు. ఫ్రెండ్ కావడంతో రెగ్యులర్ గా డీకే ఇంటికి రావడం, ఆమెతో ఎఫైర్ నడపడంతో విషయం అందరికీ తెలిసిపోయింది. ఈ విషయం కార్తీక్‌కు తప్పా తమిళనాడు టీమ్ మొత్తానికి తెలుసు. దీని గురించి దినేశ్ కార్తీక్ కు కొందరు చెప్పినా అతను నమ్మలేదు. కానీ ఏదోఒకరోజు మోసం బయటపడుతుందన్న మాట నిజమై దినేశ్ కార్తీక్ కు వాస్తవం తెలిసింది.

ఒకరోజు నిఖిత ఈ విషయాన్ని కార్తీక్‌కు చెప్పింది. మురళీ విజయ్ కారణంగా గర్భం దాల్చినట్లు చెప్పి విడాకులు ఇవ్వాలని కోరింది. విడాకులు తీసుకున్న మరుసటి రోజే మురళీ విజయ్ ను పెళ్ళి చేసుకుంది. ఆ టైమ్‌లో విజయ్.. సీఎస్‌కే, టీమిండియా ఓపెనర్‌గా రాణిస్తున్నాడు. ఈ ఊహించని పరిణామంతో దినేశ్ కార్తీక్ డిప్రెషన్‌కు లోకి వెళ్ళిపోయాడు. వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకున్న ఈ తీవ్రమైన ఘటనతో అతని ఆటతీరు కూడా పూర్తిగా దెబ్బతింది. టీమిండియాలో చోటుతో పాటు తమిళనాడు కెప్టెన్సీ బాధ్యతలను కోల్పోయాడు. ఐపీఎల్‌లోనూ దారుణంగా విఫలమయ్యాడు. ఈ బాధలను భరించలేక ఆత్మహత్యాయత్నం చేశాడు. జిమ్‌కు వెళ్లడం మానేసాడు. భార్య తనను మోసం చేసిందన్న బాధకంటే, తన స్నేహితుడు చేసిన మోసాన్ని దినేశ్ కార్తీక్ తట్టుకోలేకపోయాడు.

ఈ విషయం తెలుసుకున్న దినేశ్ కార్తీక్ ట్రైనర్.. అతని ఇంటికెళ్లి వ్యక్తిగతంగా కలిసాడు. జీవితంపై ఆశలు పెంచి మళ్లీ ట్రైనింగ్ మొదలుపెట్టేలా చేసాడు. భార్య, ఫ్రెండ్ చేసిన మోసం నుంచి కోలుకోవడానికి దినేష్ కార్తీక్‌కు మూడేళ్లు పట్టింది. ట్రైనర్ సూచనలతో మళ్లీ జిమ్‌ చేయడం మొదలుపెట్టిన దినేశ్ కార్తీక్‌కు అక్కడే ట్రైనింగ్ తీసుకుంటున్న భారత స్క్వాష్ ప్లేయర్ దీపికా పల్లికల్ పరిచయమైంది. దినేశ్ కార్తీక్‌ కథను తెలుసుకొని పల్లికల్ చలించిపోయింది. ట్రైనర్‌తో కలిసి అతనికి కౌన్సిలింగ్ ఇవ్వడం మొదలుపెట్టింది. పల్లికల్ పరిచయం కార్తీక్ జీవితానికి కొత్త ఊపిరి అయింది. ఆమెతో పరిచయం ప్రేమగా మారింది. తర్వాత వివాహబంధంతో వీరిద్దరూ ఒక్కటయ్యారు. దీపికా పల్లికల్ తో పెళ్ళి అయిన తర్వాత దినేశ్ కార్తీక్ కెరీర్ అత్యుత్తమ స్థాయిలోనే కొనసాగింది. దీపికా ఎంకరేజ్ చేయడంతో నెట్స్‌లో తీవ్రంగా శ్రమించిన అతను.. డొమెస్టిక్ మ్యాచ్‌ల్లో సత్తా చాటాడు. భారత జట్టుకు ఎంపికవ్వడంతో పాటు కేకేఆర్ కెప్టెన్సీ అందుకున్నాడు.

అయితే 34 ఏళ్ళ వయసులో రిటైర్మెంట్ ఆలోచన చేసిన డీకే కెకేఆర్ కెప్టెన్సీని వదిలేశాడు. కానీ చెన్నై సూపర్ కింగ్స్ వేలంలో అతన్ని కొనేందుకు ప్రయత్నించింది. ధోనీ వారసుడిగా తీసుకోవాలనుకుంది. అయితే వేలంలో అనూహ్యంగా చెన్నైతో పోటీపడ్డ ఆర్‌సీబీ కార్తీక్‌ను సొంతం చేసుకుంది. ఐపీఎల్ 2022 సీజన్‌లో కార్తీక్ అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. ఫినిషర్‌గా కార్తీక్ 2.0 ను తలపించాడు. ఈ ప్రదర్శనతో టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన టీ20 ప్రపంచకప్ 2022 ఆడాడు. గత ఏడాది ఐపీఎల్ కు కూడా రిటైర్మెంట్ ప్రకటించిన దినేశ్ కార్తీక్ ప్రస్తుతం కామెంటేటర్ గానూ, పలు విదేశీ లీగ్స్ లోనూ ఆడుతున్నాడు. ఓవరాల్ గా దినేశ్ కార్తీక్ భారత్ తరపున 26 టెస్టులు, 94 వన్డేలు, 60 టీట్వంటీలు ఆడాడు. ఇక ఐపీఎల్ లో 257 మ్యాచ్ లు ఆడి 22 హాఫ్ సెంచరీలతో 4842 పరుగులు చేశాడు. పల్లికల్,డీకే దంపతులకు కవలలు పుట్టారు. పెళ్లికి ముందు క్రికెటర్లు అంటే ఇష్టపడని దీపికా, దినేశ్ కార్తీక్ వ్యక్తిత్వాన్ని చూసి మనసు పారేసుకుంది. ఇప్పుడు ఇండియన్ స్పోర్ట్స్ సెలబ్రిటీల్లో అన్యోన్యమైన జంటగా గుర్తింపు తెచ్చుకున్నారు.పడిపోయినప్పుడు ఎలా లేవాలో, లేచి ఎలా పోరాడాలో తెలుసుకున్నప్పుడు గెలుపు పెద్ద కష్టం కాదు. ఇలాంటి గెలుపునే అందుకున్న దినేశ్ కార్తీక్ కెరీర్ ప్రతీ క్రీడాకారుడికీ గొప్ప స్ఫూర్తి అనడంలో ఎలాంటి డౌట్ లేదు.