Dhoni: ఇదిరా ఫ్యాన్స్ బేస్ అంటే..
అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత ఎక్కువ సమయం ఇంట్లోనే గడుపుతున్నాడు ధోనీ.

A video of a female fan touching Dhoni's feet has gone viral on social media
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 నుంచి చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ విరామంలో ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత ఎక్కువ సమయం ఇంట్లోనే గడుపుతున్నాడు. ఈ క్రమంలో కొన్నిసార్లు బయట చక్కర్లు కొడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. రిటైర్మెంట్ తర్వాత ధోనీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు. సోషల్ మీడియాలో తరచూ కనిపించే వీడియోలే ఇందుకు నిదర్శనం. తాజాగా ధోనికి సంబంధించిన హృదయాన్ని కదిలించే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ వైరల్ వీడియాలో ధోని చైర్‌లో కూర్చున్నట్లు చూడొచ్చు. ఆయన పక్కన ఒక మహిళా అభిమాని నిలబడి ఉంది. అలాగే మరికొంతమంది కూడా అక్కడ కూర్చుని ఉన్నారు. అయితే, ధోని మాట్లాడుతున్న క్రమంలో ఆ మహిళా అభిమాని మిస్టర్ కూల్ పాదాలను తాకింది. ఇది గమనించిన జార్ఖండ్ డైనమైట్ ఆమెతో కరచాలనం చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరలవుతోంది. ఈ వీడియోతో పాటు ధోని పాదాలను తాకిన పలు వీడియోలు తెరపైకి వస్తున్నాయి. ఆయన అభిమానులు చాలా మంది ఇలా చేశారు. అలాగే, IPL 2023 ప్రారంభ వేడుకలో గాయకుడు అరిజిత్ సింగ్ కూడా ధోని పాదాలను తాకాడు. ఈ వీడియో చూసిన ధోని అభిమానులు, తమ ఆరాధ్య క్రికెటర్ ను చూస్తూ ఒకింత గర్వంగా ఫీలవుతున్నారు.