Indian Festival Diwali : అసలైన దీపావళి..
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులందరూ ప్రపంచ కప్ ( World Cup) 2023 థ్రిల్‌ను ఆస్వాదించడంలో బిజీగా ఉన్నారు. ఇప్పటి వరకు జరిగిన టోర్నీలో భారత జట్టు (Indian Team) అద్భుత ప్రదర్శనతో అభిమానులను ఎంతగానో అలరించింది.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులందరూ ప్రపంచ కప్ ( World Cup) 2023 థ్రిల్‌ను ఆస్వాదించడంలో బిజీగా ఉన్నారు. ఇప్పటి వరకు జరిగిన టోర్నీలో భారత జట్టు (Indian Team) అద్భుత ప్రదర్శనతో అభిమానులను ఎంతగానో అలరించింది. నవంబర్ 12న జరిగే టోర్నీ చివరి లీగ్ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు ఇండియా, నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. దీపావళి పండుగ కూడా అదే రోజున భారతదేశంలో సెలబ్రేట్ చేస్తుంటారు. ఇందుకోసం భారత ఆటగాళ్లతో పాటు విదేశీ జట్ల ఆటగాళ్లు కూడా ముందుగా భారత అభిమానులకు శుభాకాంక్షలు తెలిపిన వీడియో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.
శనివారం, స్టార్ స్పోర్ట్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలో ముందుగా విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, శుభ్‌మన్ గిల్ భారతీయులందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత క్వింటన్ డి కాక్, బెన్ స్టోక్స్, ట్రెంట్ బౌల్ట్, రచిన్ రవీంద్ర, రషీద్ ఖాన్, కేన్ విలియమ్సన్, జో రూట్ కూడా అభిమానులందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అదే సమయంలో, కివీస్ స్పిన్నర్ ఇష్ సోధి తన విభిన్న శైలిలో పంజాబీ మాట్లాడుతూ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.