MS Dhoni: ఇదేం అభిమానం తల్లి ధోని ప్రైవేట్ పిక్స్ లీక్
ప్రపంచవ్యాప్తంగా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.

A video taken by an air hostess during Dhoni's flight has gone viral on social media
కోట్లాది మంది అభిమానులు మిస్టర్ కూల్ సొంతం. అతడు కనినిస్తే చాలు.. ఫొటోలు, సెల్ఫీల కోసం ఎగబడుతుంటారు ఫ్యాన్స్. తమ అభిమాన ఆటగాడితో ఫొటో దిగేందుకు కొందరు పరిధి దాటి ప్రవర్తిస్తుంటారు. తాజా ఇలాంటి ఘటనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన భార్య సాక్షితో కలిసి ఇటీవల ధోనీ ఓ విమానంలో ప్రయాణించాడు. ప్రయాణ సమయంలో కునుకుతీశాడు. అంతే ఈ సమయంలో అక్కడే ఉన్న ఎయిర్ హోస్టెస్ అత్యుత్సాహం ప్రదర్శించింది.
ధోనీ నిద్రపోతున్న వీడియోను సీక్రెట్‌గా రికార్డు చేసింది. పైగా వీడియో, ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ధోనీ ఎక్కడ ఉన్నారో చూడండంటూ రాసుకొచ్చింది. ఆ వీడియోలో ధోనీ నిద్రపోతుండగా.. పక్కనే సాక్షి కూర్చున్నారు. ముందు వైపున సిబ్బంది ఉండే క్యాబిన్ వద్ద ఎయిర్ హోస్టెస్ నవ్వుతూ నిలుచుని ఉంది. దీంతో అభిమాన క్రికెటర్‌తో ఫొటో దిగాలనుకోవడం మంచిదే.. కానీ, అవతలి వ్యక్తి ప్రైవసీ కూడా ముఖ్యమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.