Sarfaraz Khan: అతని ఎంట్రీ కోసం వెయిటింగ్.. సర్ఫరాజ్ ఖాన్‌పై డివిలియర్స్ కామెంట్స్
కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా గాయాల కారణంగా దూరమవడంతో సర్ఫరాజ్ ఖాన్, సౌరభ్ కుమార్, వాషింగ్టన్ సుందర్‌లకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Sarfaraz Khan: వైజాగ్ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య రెండో టెస్టుకు అంతా సిద్దమైంది. తొలి టెస్టు ఓటమికి బదులు తీర్చుకోవాలని భారత్ భావిస్తుంటే.. ఇంగ్లండ్ మాత్రం ఆధిక్యాన్ని పెంచుకోవాలని ఎదురు చూస్తోంది. కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా గాయాల కారణంగా దూరమవడంతో సర్ఫరాజ్ ఖాన్, సౌరభ్ కుమార్, వాషింగ్టన్ సుందర్‌లకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ పిలుపునిచ్చింది.
Sarfaraz Khan: సర్ఫరాజ్, పాటిదార్‌లలో ఎవరికి ఛాన్స్.. తేల్చేసిన బ్యాటింగ్ కోచ్
అయితే జడ్డూ స్ధానంలో కుల్దీప్ యాదవ్ టెస్టు ఎంట్రీ ఇవ్వడం దాదాపు ఖాయం కాగా.. రాహుల్ స్ధానంలో సర్ఫరాజ్ ఖాన్, రజిత్ పాటిదార్‌లలో ఎవరో ఒకరు అరంగేట్రం చేయనున్నారు. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వైజాగ్ టెస్టులో సర్ఫరాజ్ ఖాన్‌కు ఛాన్స్ ఇవ్వాలని డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు. సర్ఫరాజ్ ఖాన్ అరంగేట్రం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నానన్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అతడి రికార్డు అద్భుతమైనది. భారత జట్టు తరపున డెబ్యూ చేసేందుకు సర్ఫరాజ్‌కు అన్ని రకాల అర్హతలు ఉన్నాయన్నాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో సైతం అతడు అదరగొడుతాడని ఏబీడి కాన్ఫిడెంట్‌గా చెప్పాడు. మరోవైపు రజత్ పాటిదార్ కూడా డొమెస్టిక్ క్రికెట్‌లో మెరుగ్గా రాణిస్తున్నాడనీ, ఎవరికి జట్టులో చోటు దక్కుతుందో వేచి చూడాలని తన యూట్యూబ్ ఛానల్‌లో డివిలియర్స్ విశ్లేషించాడు.