Harthik Pandya: కొందరు జై అంటున్నారు.. కొందరు నై అంటున్నారు
తిలక్ వర్మ తన హాఫ్ సెంచరీకి కేవలం ఒక్క పరుగు దూరంలో ఉన్నాడని తెలిసి కూడా.. హార్దిక్ సిక్స్ కొట్టి మ్యాచ్ ముగించడం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడిచింది. కెప్టెన్‌గా పనికిరాడని, స్వార్థపరుడని హార్దిక్‌ను దారుణంగా ట్రోలు చేశారు.

AB Devillier reacts to Harsha Bhogle's comment on Harthik Pandya's trolls
తిలక్ వర్మ తన హాఫ్ సెంచరీకి కేవలం ఒక్క పరుగు దూరంలో ఉన్నాడని తెలిసి కూడా.. హార్దిక్ సిక్స్ కొట్టి మ్యాచ్ ముగించడం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడిచింది. కెప్టెన్‌గా పనికిరాడని, స్వార్థపరుడని హార్దిక్‌ను దారుణంగా ట్రోలు చేశారు. అయితే విషయంలో హార్దిక్ తీరును కొంతమంది తప్పుబడతుంటే, మరి కొంతమంది మద్దతుగా నిలుస్తున్నారు.ఈ విషయంపై ఇంత పెద్ద చర్చ అనవసరమని ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే అభిప్రాయపడ్డాడు. టీ20ల్లో హాఫ్ సెంచరీ అనేది పెద్ద ల్యాండ్ మార్క్ కాదని అన్నాడు. దీనిపై ఏబీ డివిలియర్స్ స్పందిస్తూ అంతిమంగా ఒకరు నోరు విప్పారు.. థాంక్యూ అంటూ ట్వీట్ చేశాడు.
దీనిని తిప్పికొడుతూ ఆకాష్ చోప్రా తనదైన శైలిలో తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. రికార్డులకంటే యువ ఆటగాడిలో స్పూర్తి నింపడం మన బాధ్యత. నాకు బాగా గుర్తుంది. 2014 టీ20 ప్రపంచకప్‌లో ధోనికి ఇదే పరిస్ధితి ఎదురైంది. ఆ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి సూపర్ ఇన్నింగ్స్‌తో అవతలి ఎండ్‌లో ఉన్నాడు. అయితే ధోని మాత్రం విరాట్‌ను హీరోను చేయాలని భావించాడు. అందుకే కోహ్లికి స్ట్రైక్ ఇవ్వగా.. కోహ్లి మ్యాచ్ ఫినిష్ చేశాడు. ధోనినే తనకు ఆదర్శమని హార్దిక్ చాలా సందర్బాల్లో చెప్పిన హార్దిక్ .. ధోనిని ఏ రకంగానూ ఫాలో అవ్వడం లేదని తన యూట్యూబ్ ఛానల్‌లో చోప్రా పేర్కొన్నాడు.