అబ్దుల్ సమద్ నయాహిస్టరీ రంజీల్లో రికార్డుల మోత
సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ బ్యాటర్ అబ్దుల్ సమద్ రంజీ ట్రోఫీలో ఆల్‌టైమ్ రికార్డులు సాధిస్తున్నాడు. కటక్‌లో ఒడిస్సాతో జరిగిన మ్యాచ్‌లో సమద్ రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలతో కదం తొక్కాడు

సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ బ్యాటర్ అబ్దుల్ సమద్ రంజీ ట్రోఫీలో ఆల్‌టైమ్ రికార్డులు సాధిస్తున్నాడు. కటక్‌లో ఒడిస్సాతో జరిగిన మ్యాచ్‌లో సమద్ రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలతో కదం తొక్కాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 117 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్సర్లతో 127 పరుగులు చేశాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 108 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఈ క్రమంలో ఒకే రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో రెండు సెంచరీలు సాధించిన మొదటి జమ్ము కశ్మీర్ ప్లేయర్‌గా అబ్దుల్ సమద్ రికార్డు నెలకొల్పాడు. అలాగే ఓ రంజీ మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన మూడో భారత ప్లేయర్‌గా ఘనత సాధించాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 15 సిక్సర్లు బాదిన అబ్దుల్ సమద్ కంటే ముందు స్థానాల్లో తన్మయ్ అగర్వాల్ , రిషభ్ పంత్ ఉన్నారు.