సెంచరీల మీద సెంచరీలు సెలక్టర్లు కరుణిస్తారా ?
టీమిండియాలో చోటు దక్కించుకోవాలంటే దేశవాళీ క్రికెట్ లో ప్రదర్శనే ప్రామాణికం...అందుకే చాలా మంది యువ క్రికెటర్లు రంజీ ట్రోఫీతో పాటు పలు దేశవాళీ టోర్నీలపైనే ఫోకస్ పెడుతుంటారు.
టీమిండియాలో చోటు దక్కించుకోవాలంటే దేశవాళీ క్రికెట్ లో ప్రదర్శనే ప్రామాణికం…అందుకే చాలా మంది యువ క్రికెటర్లు రంజీ ట్రోఫీతో పాటు పలు దేశవాళీ టోర్నీలపైనే ఫోకస్ పెడుతుంటారు. అయితే డొమెస్టిక్ క్రికెట్ లో అదరగొడుతున్నా ఉత్తరాఖండ్ ప్లేయర్ అభిమన్యు ఈశ్వరన్ కు మాత్రం సెలక్టర్ల నుంచి పిలుపు అందడం లేదు. గత కొన్నేళ్ళుగా రంజీ మ్యాచ్ లతో పాటు పలు టోర్నీల్లో అభిమన్యు పెద్ద ఇన్నింగ్స్ లతో సత్తా చాటుతున్నాడు. ప్రస్తుతం ఇరానీ ట్రోఫీలోనూ అభిమన్యు 191 పరుగుల భారీ స్కోర్ చేసి తృటిలో డబుల్ సెంచరీ కోల్పోయాడు. ఇప్పటివరకు 161 ఫస్ట్ క్లాస్ ఇన్నింగ్స్ లు ఆడిన అభిమన్యు ఈశ్వరన్ 49 యావరేజ్ తో 7404 పరుగులు చేశాడు. వీటిలో 25 సెంచరీలు.. 30 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
సెంచరీల మీద సెంచరీలు కొడుతున్నా భారత జట్టు తరపున ఆడలేకపోతున్నాడు. ప్రస్తుతం భారత జట్టులో ప్రతీ ప్లేస్ కూ విపరీతమైన పోటీ ఉండడమే దీనికి కారణం. అయితే ఆసీస్ టూర్ కు అభిమన్యు ఈశ్వరన్ ఎంపికవుతాడని పలువురు అంచనా వేస్తున్నారు. టెస్ట్ ఫార్మాట్ లో భారీ ఇన్నింగ్స్ లు ఆడే ప్లేయర్స్ కే ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు పరిస్థితులకు తగ్గట్టే ఆడడంలో అభిమన్యు ఈశ్వరన్ కు మంచి అనుభవమే ఉంది. దీంతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి అతన్ని సెలక్టర్లు పరిగణలోకి తీసుకుంటారని భావిస్తున్నారు. కాగా ఆసీస్ గడ్డపై ఐదు టెస్టుల సిరీస్ కావడంతో పెద్ద జట్టునే బీసీసీఐ పంపించబోతోంది.