ఒక్క సెంచరీతో నెంబర్ 2 ఐసీసీ ర్యాంకింగ్స్ లో అభిషేక్ దూకుడు

టీ ట్వంటీ క్రికెట్ లో ప్రస్తుతం భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ హవా నడుస్తోంది. ఇంగ్లాండ్ తో చివరి టీ ట్వంటీ లో అతను ఆడిన విద్వంసకర ఇన్నింగ్స్ ఫాన్స్ మరిచిపోలేరు. ఈ ఒక్క ఇన్నింగ్స్ తో విమర్శకులు సైతం అతనికి ఫాన్స్ గా మారిపోయారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 6, 2025 | 06:35 PMLast Updated on: Feb 06, 2025 | 6:35 PM

Abhishek Is Number 2 In Icc Rankings With One Century

టీ ట్వంటీ క్రికెట్ లో ప్రస్తుతం భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ హవా నడుస్తోంది. ఇంగ్లాండ్ తో చివరి టీ ట్వంటీ లో అతను ఆడిన విద్వంసకర ఇన్నింగ్స్ ఫాన్స్ మరిచిపోలేరు. ఈ ఒక్క ఇన్నింగ్స్ తో విమర్శకులు సైతం అతనికి ఫాన్స్ గా మారిపోయారు. ఈ సెంచరీతో అటు ఐసీసీ ర్యాంకింగ్స్ లోనూ అభిషేక్ శర్మ దూసుకెళ్లాడు. ఇంగ్లాండ్ పై ఐదో టీ20 లో రికార్డ్ బ్రేకింగ్ సెంచరీ బాదిన అతడు.. 829 పాయింట్లతో రెండో స్థానానికి చేరుకున్నాడు. ఏకంగా 38 స్థానాలు ఎగబాకి ఈ రెండో ర్యాంకును అందుకున్నాడు. ఆస్ట్రేలియా స్టార్ ట్రావిస్ హెడ్ 855 పాయింట్లతో తన టాప్ ప్లేస్ నిలుపుకున్నాడు. అభిషేక్ శర్మ అతడి కన్నా కేవలం 26 పాయింట్లు వెనుకంజలో మాత్రమే ఉన్నాడు . అభిషేక్ శర్మ కేవలం బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో మాత్రమే కాదు.. ఆల్ రౌండర్ విభాగంలోనూ 31 స్థానాలు ఎగబాకి 13వ ర్యాంకుకు చేరుకున్నాడు.

బ్యాటింగ్ విభాగంలో టాప్ ఫైవ్ లో అభిషేక్ శర్మతో పాటు మరో ఇద్దరు టీమిండియా ప్లేయర్స్ కూడా చోటు దక్కించుకున్నారు. తిలక్ వర్మ 803 పాయింట్లతో మూడో స్థానంలోనూ, టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఐదో స్థానంలో నిలిచాడు. హార్దిక్ పాండ్య ఐదు స్థానాలు ఎగబాకి 51వ ర్యాంకులోనూ నిలిచారు. ఇక శివమ్ దూబె ఏకంగా 38 స్థానాలను ఎగబాకి 58వ స్థానంలో నిలిచాడు.

బౌలింగ్ విభాగంలో.. ఇంగ్లాండ్ పై ప్లేయర్ ఆఫ్‌ ది సిరీస్‌గా నిలిచిన వరుణ్‌ చక్రవర్తి మూడు స్థానాలు ఎగబాకి మూడో ర్యాంక్‌కు చేరుకున్నాడు. వెస్టిండీస్ బౌలర్ అకీల్ హుసేన్ 707 పాయింట్లతో టాప్ ప్లేస్ లో నిలిచాడు. అదిల్ రషీద్, వరుణ్‌ చక్రవర్తి చెరో 705 పాయింట్లతో రెండు, మూడు స్థానాలను సంపాదించుకున్నారు. రవి బిష్ణోయ్ 671 పాయింట్లతో నాలుగు స్థానాలు మెరుగై ఆరో ర్యాంకులో నిలిచాడు. మరోవైపు టెస్టుల్లో.. బ్యాటింగ్ ర్యాంకింగ్స్ కి సంబంధించి ఇంగ్లాండ్ జో రూట్ అగ్రస్థానంలో ఉన్నాడు. టాప్‌ -10లో కేవలం ఇద్దరు భారత బ్యాటర్లు మాత్రమే ఉండగా.. బౌలింగ్‌ విభాగంలో బుమ్రా టాప్ ప్లేస్ లో కొనసాగుతున్నాడు.