షమీ ఫిట్ గా లేడా ? క్లారిటీ ఇచ్చిన అభిషేక్ శర్మ
ఇంగ్లాండ్ తో జరిగిన తొలి టీ ట్వంటీ వన్ సైడ్ గా ముగిసింది. ఇంగ్లీష్ టీమ్ ఏ దశలోనూ పోటీఇవ్వలేకపోవడం భారత్ సునాయాసంగా గెలిచింది. అయితే ఈ మ్యాచ్ లో మహ్మద్ షమీ ఆడకపోవడం ఆశ్చర్చపరిచింది. తుది జట్టులో షమీ ఉంటాడని చాలా మంది భావించారు.
ఇంగ్లాండ్ తో జరిగిన తొలి టీ ట్వంటీ వన్ సైడ్ గా ముగిసింది. ఇంగ్లీష్ టీమ్ ఏ దశలోనూ పోటీఇవ్వలేకపోవడం భారత్ సునాయాసంగా గెలిచింది. అయితే ఈ మ్యాచ్ లో మహ్మద్ షమీ ఆడకపోవడం ఆశ్చర్చపరిచింది. తుది జట్టులో షమీ ఉంటాడని చాలా మంది భావించారు. దాదాపు ఏడాదిన్నర తర్వాత రీఎంట్రీ ఇస్తున్న షమీ ఫామ్ కంటిన్యూ చేస్తే చూడాలని ఫ్యాన్స్ కూడా అనుకున్నారు.
కానీ తుది జట్టులో అతని పేరు లేకపోవడం అందరికీ షాకిచ్చింది. దీంతో ఈ సీనియర్ పేసర్ ఫిట్ గా లేడన్న అనుమానాలు తలెత్తాయి. అయితే షమీని ఆడించకపోవడం వెనుక అసలు కారణాన్ని అభిషేక్ శర్మ చెప్పాడు. ఈడెన్ పిచ్ పై ముగ్గురు స్పిన్నర్లతో ఆడాలన్న నిర్ణయంతోనే షమీకి రెస్ట్ ఇచ్చారని చెప్పాడు. శనివారం జరిగే రెండో టీట్వంటీలో షమి ఆడతాడని తెలుస్తోంది.