Abhishek Sharma: చిక్కుల్లో సన్‌రైజర్స్ ఆల్‌రౌండర్.. మోడల్ సూసైడ్ కేసులో నోటీసులు
ఆలస్యంగా ఇంటికి వచ్చిన తానియా బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆమె ఆత్మహత్యకు పాల్పడే ముందు చివరిసారిగా అభిషేక్ శర్మకు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తానియా కాంటాక్ట్ హిస్టరీ చెక్ చేసిన పోలీసులు అభిషేక్ శర్మను విచారణకు పిలిచినట్లు సమాచారం.
Abhishek Sharma: సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ ఆల్‌రౌండర్, పంజాబీ క్రికెటర్ అభిషేక్ శర్మ వివాదంలో చిక్కుకున్నాడు. సూరత్‌కు చెందిన మోడల్ తానియా సింగ్ ఆత్మహత్య కేసులో పోలీసులు అతడికి నోటీసులు జారీ చేశారు. 28 ఏళ్ల తానియా సింగ్ ఫ్యాషన్ ప్రపంచంలో మోడల్‌గా రాణిస్తున్నారు. డీజే, మెకప్ ఆర్టిస్ట్‌గానూ ఆమెకు అనుభవం ఉంది.
Ind vs Eng: బూమ్రాకు రెస్ట్, కేఎల్ రాహుల్ ఔట్.. రాంచీ టెస్టుకు ముకేష్ కుమార్
సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే తానియా.. అభిషేక్ శర్మతో కాంటాక్ట్‌లో ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. మంగళవారం రాత్రి ఆలస్యంగా ఇంటికి వచ్చిన తానియా బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆమె ఆత్మహత్యకు పాల్పడే ముందు చివరిసారిగా అభిషేక్ శర్మకు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తానియా కాంటాక్ట్ హిస్టరీ చెక్ చేసిన పోలీసులు అభిషేక్ శర్మను విచారణకు పిలిచినట్లు సమాచారం. అయితే, అభిషేక్ విచారణలో భాగంగా పోలీసులకు పూర్తిగా సహకరిస్తున్నట్లు సమాచారం. తానియా తనకు ఫ్రెండ్ మాత్రమేనని.. అయితే, చాలా కాలంగా ఆమెతో టచ్‌లో లేనని అభిషేక్ పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది.
పంజాబ్‌కు చెందిన 23 ఏళ్ల స్పిన్ ఆల్‌రౌండర్ అభిషేక్ శర్మ రంజీ ట్రోఫీ సీజన్‌లో పాల్గొన్నాడు. పంజాబ్ తరఫున నాలుగు మ్యాచ్‌లు ఆడి 199 పరుగులు చేయడంతో పాటు మూడు వికెట్లు తీశాడు. అయితే, పంజాబ్ గ్రూపు దశలోనే నిష్క్రమించింది. మరోవైపు.. ఐపీఎల్ 17వ సీజన్‌కు సన్నద్ధమవుతున్న క్రమంలో ఇలా చిక్కుల్లో పడ్డాడు.