షేక్ ఆడించిన అభిషేక్, యువ ఓపెనర్ నయా హిస్టరీ
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ చరిత్ర సృష్టించాడు. 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున అత్యంత వేగంగా సెంచరీ నమోదు చేసిన తొలి భారత బ్యాటర్‌గా నిలిచాడు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ చరిత్ర సృష్టించాడు. 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున అత్యంత వేగంగా సెంచరీ నమోదు చేసిన తొలి భారత బ్యాటర్‌గా నిలిచాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ శర్మ ఈ ఫీట్ సాధించాడు. ఈ మ్యాచ్‌లో 40 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్న అభిషేక్ శర్మ.. మొత్తం 55 బంతుల్లో 14 ఫోర్లు, 10 సిక్స్‌లతో 141 పరుగులు చేశాడు.
పంజాబ్ కింగ్స్ ఫీల్డర్ల తప్పిదాలతో పాటు యశ్ ఠాకూర్ నోబాల్‌తో ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అభిషేక్.. మరో 21 బంతుల వ్వవధిలో సెంచరీ మార్క్ అందుకున్నాడు. ట్రావిస్ హెడ్‌తో కలిసి తొలి వికెట్‌కు 171 పరుగులు జోడించిన అభిషేక్.. క్లాసెన్‌తో కలిసి రెండో వికెట్‌కు 51 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు.
ఈ క్రమంలో అతను ఇషాన్ కిషన్ రికార్డ్ బద్దలు కొట్టాడు. ఆరెంజ్ ఆర్మీ తరఫున ఐపీఎల్‌లో ఫాస్టెస్ సెంచరీ చేసిన ఇండియన్ బ్యాటర్‌గా నిలిచాడు. ఈ సీజన్‌లోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున రాజస్థాన్ రాయల్స్‌పై అరంగేట్ర మ్యాచ్‌లోనే ఇషాన్ కిషన్ 45 బంతుల్లో సెంచరీ నమోదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ రికార్డ్‌ను అభిషేక్ శర్మ బ్రేక్ చేశాడు.
ఓవరాల్‌గా సన్‌రైజర్స్ బ్యాటర్ల ఫాస్టెస్ సెంచరీల జాబితాలో ట్రావిస్ హెడ్ టాప్‌లో ఉన్నాడు. గతేడాది అతను ఆర్‌సీబీపై 39 బంతుల్లో సెంచరీ సాధించాడు. డేవిడ్ వార్నర్ మూడో స్థానంలో ఉన్నాడు. 2017లో అతను సెంచరీ అందుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే మూడో అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేసిన బ్యాటర్‌గా అభిషేక్ శర్మ రికార్డ్ సాధించాడు. ఈ జాబితాలో క్రిస్ గేల్ 175 నాటౌట్, బ్రెండన్ మెక్‌కల్లమ్ 158 నాటౌట్ అభిషేక్ శర్మ కంటే ముందున్నారు.
ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 245 పరుగుల భారీ స్కోర్ చేసింది.అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ 18.3 ఓవర్లలో 2 వికెట్లకు 247 పరుగులు చేసి గెలుపొందింది.