Mohammad Hafeez: పాక్ క్రికెట్ సెలక్షన్ కమిటీ ఛీప్ రేసులో మహ్మద్ హఫీజ్..?
ఆసియా కప్‌కు ముందు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పాకిస్థాన్ జట్టుకు చీఫ్ సెలక్టర్ గా మాజీ క్రికెటర్ మహ్మద్ హఫీజ్ ఎంపిక కానున్నట్లు తెలుస్తోంది. రెండేళ్ల క్రితం మహ్మద్ హఫీజ్ అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అతను 2021లో జరిగిన టీ20 ప్రపంచ కప్ లో ఆడాడు. ప్రస్తుతం పాకిస్తాన్‌లో చీఫ్ సెలెక్టర్ కుర్చీ ఖాళీగా ఉండటంతో.. ఇతని పేరు బయటికొచ్చింది. పాక్ మీడియా నివేదికల ప్రకారం.. ఈ మాజీ ఆల్ రౌండర్ హఫీజ్.. జట్టు చీఫ్ సెలెక్టర్ అయ్యే రేసులో ముందంజలో ఉన్నాడు.
ప్రస్తుతం పాకిస్థాన్ జట్టు శ్రీలంక పర్యటనలో ఉంది. ఈ పర్యటన అనంతరం మహ్మద్ హఫీజ్ చీఫ్ సెలక్టర్ బాధ్యతను పొందే అవకాశాలు ఉన్నాయి. మహ్మద్ హఫీజ్ విషయానికొస్తే.. అతను పాకిస్తాన్ తరపున 55 టెస్టులు, 218 వన్డేలు, 119 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 12 వేలకు పైగా పరుగులు చేసి 21 సెంచరీలు సాధించాడు. మహ్మద్ హఫీజ్ ఐపీఎల్ ఐపీఎల్ మొదటి సీజన్ లో ఆడాడు. తొలి సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు తరుఫున ఆడాడు. ఆ సమయంలో జట్టు కెప్టెన్ సౌరవ్ గంగూలీ.. అతనికి మొదటి ఐపీఎల్ మ్యాచ్‌లోనే అవకాశం ఇచ్చాడు.