Cricket Selections: క్రికెట్ బాగా ఆడగలరా.. నేషనల్ క్రికెట్ అకాడమీ అడ్మిషన్లు

ఇండియాలో క్రికెట్ అనేది కేవలం ఒక ఆట కాదు. ఇది కొన్ని కోట్ల మంది ఎమోషన్.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 19, 2023 | 01:53 PMLast Updated on: Aug 19, 2023 | 1:53 PM

Admissions Are Open For Joining The National Cricket Academy

ఇండియాలో క్రికెట్ అనేది కేవలం ఒక ఆట కాదు. ఇది కొన్ని కోట్ల మంది ఎమోషన్. క్రికెట్‌ను మతం కంటే ఎక్కువగా ఆరాధించే హార్డ్ కోర్ ఫ్యాన్స్ భారత్‌లో ఎంతోమంది ఉన్నారు. ఈ ప్రభావంతోనే చిన్నతనం నుంచే క్రికెటర్‌గా మారాలని, ఈ రంగంలో కెరీర్‌ను చూసుకోవాలని ఎంతోమంది నిర్ణయించుకుంటున్నారు. మీరు కూడా ఇదే కేటగిరీకి చెందితే, క్రికెట్‌ను కెరీర్‌గా మార్చేందుకు నేషనల్ క్రికెట్ అకాడమీకి సెలక్ట్ అవ్వడం టార్గెట్‌గా పెట్టుకోవాలి. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా , 2000లో నేషనల్ క్రికెట్ అకాడమీని ఏర్పాటు చేసింది. ఇది దేశంలోని క్రికెట్ ట్రైనింగ్ సెంటర్లలో ప్రధానమైనది. క్రికెట్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించాలని కలలు కనే వారికి NCAకు ఎంపిక కావడం అనేది తొలిమెట్టు.

క్రికెట్‌ను కెరీర్‌గా మార్చుకోవాలనుకుంటే ఈ అకాడమీలో చేరడం మంచిది. నేషనల్ క్రికెట్ అకాడమీకి సెలక్ట్ కావాలంటే, క్రికెట్‌లో వివిధ రకాల క్వాలిఫికేషన్స్ ఉండాలి. వీటిలో మొదటిది, అభ్యర్థులు తప్పనిసరిగా తమ స్కూల్ క్రికెట్ టీమ్‌లో కచ్చితంగా ఒక ప్లేయర్ అయ్యి ఉండాలి. ఆ తర్వాత స్కూల్ జట్టు అకాడమీ లెవల్‌లో క్రికెట్ ఆడాలి. స్కూల్ లెవల్ తర్వాత అండర్- 15 అండర్ -17, అండర్-19, అండర్-23, ఓపెన్ డివిజన్ వంటి వివిధ ఏజ్ లెవల్ కేటగిరీలను కవర్ చేస్తూ జిల్లా స్థాయి పోటీల్లో ఆడాలి. ఈ దశల్లో సక్సెస్ అయితే, రాష్ట్ర స్థాయిలో పోటీ పడేందుకు కోచింగ్ పొందాలి. ఆ తర్వాత NCAలో చేరడానికి అవకాశం లభిస్తుంది. అనంతరం రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ క్యాంప్స్‌కు సెలక్ట్ అయ్యే ఛాన్స్‌లు పెరుగుతాయి.

NCA ట్రైనింగ్, ఎక్స్‌పీరియన్స్‌తో సంబంధిత ఏజ్ కేటగిరీలో జాతీయ స్థాయిలో టాప్-15 లైనప్‌కు సెలక్ట్ కావచ్చు. ఈ సెలక్షన్ తర్వాత జోనల్ స్థాయిలో క్రికెట్ ఆడొచ్చు. జోనల్ అకాడమీలో విభిన్న టోర్నమెంట్లలో పాల్గొనడానికి ట్రైనింగ్ ఇస్తారు. అభ్యర్థి ఆటకు తగ్గట్లు, ఇంప్రూవ్ అవ్వాల్సిన విషయాలపై ట్రైనింగ్ ఇస్తారు. ఆటగాడి సామర్థ్యాల ఆధారంగా తర్వాతి సెలక్షన్స్ ఉంటాయి. క్రికెట్‌ను కెరీర్‌గా మార్చుకోవాలనే లక్ష్యం ఉన్నవారు ఇందుకు పాఠశాల స్థాయి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టాలి. ముందు స్కూల్ టీమ్‌లో, ఆ తర్వాత ఇంటర్ కాలేజ్ టీమ్‌లో ఆడాలి. అనంతరం సెమీ ప్రొఫెషనల్ టీమ్‌లో ప్లేస్ లక్ష్యంగా పెట్టుకోండి. రీజినల్ టోర్నమెంట్ల నుంచి బెస్ట్ క్రికెటర్లను NCA సెలక్ట్ చేస్తుంది. టోర్నమెంట్‌లలో పాల్గొనేవారిని పర్యవేక్షించడానికి అధికారులను నియమిస్తుంది. చివరికి అసాధారణ ప్రతిభ ఉన్న ఆటగాళ్లను గుర్తించి, సెలక్ట్ చేస్తుంది. అయితే ఈ సుదీర్ఘ ప్రయాణానికి కుటుంబ మద్దతుతో పాటు ఓపిక, ఆర్థిక బలం కూడా అవసరమే. అలాగే నిబద్ధతతో ప్రయత్నిస్తే ఎన్‌సీఏ, ఆ తర్వాత నేషనల్ టీమ్‌కు సైతం సెలక్ట్ కావచ్చు.