Zimbabwe Tour : ఆఖరి మ్యాచ్ లోనూ అదుర్స్.. యంగ్ ఇండియా గ్రాండ్ విక్టరీ
జింబాబ్వే టూర్ ను భారత యువ జట్టు ఘనంగా ముగించింది. ఐదో టీ ట్వంటీలోనూ ఆతిథ్య జట్టును చిత్తు చేసింది.

Adurs in the final match.. Young India's grand victory
జింబాబ్వే టూర్ ను భారత యువ జట్టు ఘనంగా ముగించింది. ఐదో టీ ట్వంటీలోనూ ఆతిథ్య జట్టును చిత్తు చేసింది. 42 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్ ను 4-1తో కైవసం చేసుకుంది. మొదట బ్యాటింగ్ కు దిగిన భారత్ 167 పరుగులు చేసింది. సంజూ శాంసన్ హాఫ్ సెంచరీతో రాణించాడు. కీలక సమయంలో జట్టును ఆదుకుని 45 బంతుల్లో 58 పరుగులు చేశాడు. ఛేజింగ్ లో జింబాబ్వే ఆరంభం నుంచే తడబడింది. భారత బౌలర్లు మరోసారి ఆతిథ్య జట్టుకు అవకాశం ఇవ్వకుండా వరుస వికెట్లు పడగొట్టారు. ముఖ్యంగా పేసర్ ముఖేశ్ కుమార్ 4 వికెట్లతో సత్తా చాటాడు. శివమ్ దూబే 2 వికెట్లు పడగొట్టాడు. దీంతో జింబాబ్వే 125 పరుగులకే కుప్పకూలింది.