World Cup 2023 : పఠాన్ ముందు పౌరుషాలు..
ప్రపంచ కప్ 2023 లో పాకిస్థాన్‌పై విజయం సాధించగానే అఫ్గాన్ క్రికెటర్లు ఆనందంలో మునిగిపోయారు. చెపాక్ మైదానమంతా కలియ తిరుగతూ తమకు మద్దతు తెలిపిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలిపారు.

Afghan cricketers were overjoyed after winning the World Cup 2023 against Pakistan
ప్రపంచ కప్ 2023 లో పాకిస్థాన్‌పై విజయం సాధించగానే అఫ్గాన్ క్రికెటర్లు ఆనందంలో మునిగిపోయారు. చెపాక్ మైదానమంతా కలియ తిరుగతూ తమకు మద్దతు తెలిపిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలిపారు. అదే సమయంలో అక్కడ కామెంటరీ చేస్తోన్న ఇర్ఫాన్ పఠాన్ వారితో కలిసి స్టెప్పులు వేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. మెగా టోర్నీ కామెంటేటర్ గా వ్యవహరిస్తున్న పఠాన్ అలా చేయడాన్ని కొందరు విమర్శించగా, మరికొందరు ఇది క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించే చర్య అని కొనియాడారు.
IPL Royal Challengers Bangalore Rachin Ravindra : బెంగళూరు జట్టులో రచిన్?
చివరకు ఈ చర్యలు ఇర్ఫాన్ పఠాన్ కెరీర్‌కు కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టాయి. ఆఫ్ఘన్ విజయంపై పఠాన్ సంబరాలు చేసుకుపోవడం నచ్చక పాక్ కెప్టెన్ అతని ఇంటర్వ్యూని తిరస్కరించినట్లు కథనాలు వస్తున్నాయి. బాబర్ ఆజం ప్రత్యేక ఇంటర్వ్యూ తీసుకోవడానికి స్టార్ స్పోర్ట్స్ ప్రయత్నించగా అతడు తిరస్కరించాడని సమాచారం. తన మాతృభూమి పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా మాట్లాడే వారితో సంభాషించడంతనకు ఇష్టం లేదని బాబర్ ఆజం చెప్పినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన అభిమానులు ఆమాత్రం పౌరుషం ఉండాలే! అని పాక్ కెప్టెన్ ను మరింత రెచ్చగొడుతున్నారు.