Nijat Masood: ఎవరీ నిజత్ మసూద్ ప్రపంచంలో ఏడో బౌలర్ గా రికార్డు
ఢాకా వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టెస్ట్‌లో ఆఫ్గానిస్తాన్ ఆరంగేట్ర ఫాస్ట్ బౌలర్ నిజత్ మసూద్ తొలి మ్యాచ్‌లోనే అరుదైన రికార్డులను నమోదు చేసుకున్నాడు.

Afghanistan right hand bowler Nijit Masood became the seventh bowler in the world
బంగ్లాదేశ్, ఆఫ్ఘానిస్తాన్ మధ్య జరుగుతున్న ఏకైక టెస్ట్‌లో తన తొలి బంతికే ఆతిథ్య జట్టు ఓపెనర్ జకీర్ హసన్‌ను ఔట్ చేశాడు మసూద్. తద్వారా ఆరంగేట్ర టెస్ట్ మ్యాచ్ తొలి బంతికే వికెట్ పడగొట్టిన 7వ బౌలర్‌గా నిలిచాడు. అలాగే ఐదుగురు బంగ్లా ఆటగాళ్లను ఔట్ చేసి.. ఆఫ్ఘాన్ టెస్ట్ చరిత్రలో ఆరంగేట్ర మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లోనే ఫైవ్ వికెట్ హాల్ సాధించిన మొట్టమొదటి ప్లేయర్‌గా అవతరించాడు. అయితే మసూద్ రికార్డులు సృష్టించినప్పటికీ.. మ్యాచ్‌లో మాత్రం బంగ్లాదేశ్ పైచేయి సాధించింది. అయితే రషీద్ ఖాన్ వంటి సూపర్ స్టార్స్ ని ప్రపంచానికి అందించిన ఆఫ్ఘానిస్తాన్ క్రికెట్, సరికొత్త టాలెంట్ ని గుర్తిస్తూ, భవిష్యత్ లెజెండ్స్ ని తయారుచేసే పనిలో చాలా సీరియస్ గా కనిపిస్తుంది.