India VS Australia : పిచ్ పైకి దూసుకొచ్చిన అగంతకుడు.. టెన్షన్ పడ్డ విరాట్
ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ పోరు హోరాహోరీగా సాగుతోంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. వరుసగా వికెట్లు పడటంతో టీమ్ భారాన్ని మోసేందుకు వికాట్ కొహ్లీ క్రీజ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. హాఫ్ సెంచరీ కొట్టి ప్రతీ ఒక్కరిలో ఉత్తేజాన్ని నింపాడు. ఎలా వచ్చాడో తెలియదు గానీ ఓ అగంతకుడు విరాట్ దగ్గరకు వచ్చాడు. వచ్చి విరాట్ ను పట్టుకున్నాడు. పాలస్తీన మీద జరుగుతున్న దాడులను ఆపాలంటూ నిరసన తెలిపాడు. వెంటనే గార్డ్స్ వచ్చి అతన్ని అక్కడి నుంచి తీసుకువెళ్లారు.

Agantaka who rushed up the pitch.. Virat whose tension fell
ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ పోరు హోరాహోరీగా సాగుతోంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. వరుసగా వికెట్లు పడటంతో టీమ్ భారాన్ని మోసేందుకు వికాట్ కొహ్లీ క్రీజ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. హాఫ్ సెంచరీ కొట్టి ప్రతీ ఒక్కరిలో ఉత్తేజాన్ని నింపాడు. ఎలా వచ్చాడో తెలియదు గానీ ఓ అగంతకుడు విరాట్ దగ్గరకు వచ్చాడు. వచ్చి విరాట్ ను పట్టుకున్నాడు. పాలస్తీన మీద జరుగుతున్న దాడులను ఆపాలంటూ నిరసన తెలిపాడు. వెంటనే గార్డ్స్ వచ్చి అతన్ని అక్కడి నుంచి తీసుకువెళ్లారు. అప్పుడే అర్థమైంది అందరికీ.. విరాట్ దగ్గరకు వచ్చిన వ్యక్తి పాలస్తీనా మద్దతుదారుడు అని. ఫ్రీ పాలస్తీనా పేరుతో టీషర్ట్ వేసుకున్న అతను.. పాలస్తీనా జండాను పోలిన మాస్క్ పెట్టుకున్నాడు. చేతిలో జెండాతో విరాట్ దగ్గరకు వచ్చి.. అంతా కాసేపు టెన్షన్ పడేలా చేశాడు. దాదాపు 7 వారాల నుంచి ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య యుద్ధం జరుగుతూనే ఉంది. గాజా నుంచి పాలస్తీనా ఇజ్రాయెల్ మీద చేసిన దాడితో ఈ యుద్ధం మొదలైంది. ఇప్పటికే 12 వేల మంది ఈ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారు. లక్షల మంది గాయపడ్డారు. వేల సంఖ్యలో ప్రజలు ఆశ్రయం కోల్పోయి ప్రణాలు అరచేతిలో పెట్టుకుని వలసపోతున్నారు. కానీ ఇప్పటికీ అక్కడ పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపేందుకు అన్ని దేశాలు తమవంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. కానీ ఫలితం మాత్రం శూన్యం. ఈ రెండు దేశాల మధ్య యుద్ధం ఎప్పుడు ఆగుతుంది. మళ్లీ శాంతి ఎప్పుడు చేకూరుతుందో చూడాలి.