Hardik Pandya : సెర్బియా వెళ్ళడం అగస్త్యకు ఇష్టం లేదా ? వైరల్ గా హార్థిక్ కొడుకు వీడియో
హార్థిక్ పాండ్యా తన వ్యక్తిగత జీవితంలో ప్రస్తుతం కష్టకాలం ఎదుర్కొంటున్నాడు. ప్రేమించి పెళ్ళి చేసుకున్న నటాషాతో హార్థిక్ బంధం నాలుగేళ్ళకే ముగిసిపోయింది.
హార్థిక్ పాండ్యా తన వ్యక్తిగత జీవితంలో ప్రస్తుతం కష్టకాలం ఎదుర్కొంటున్నాడు. ప్రేమించి పెళ్ళి చేసుకున్న నటాషాతో హార్థిక్ బంధం నాలుగేళ్ళకే ముగిసిపోయింది. తామిద్దరం పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్టు ఇటీవలే హార్థిక్ అధికారికంగా ప్రకటించాడు. దీంతో కొడుకు అగస్త్యను తీసుకుని నటాషా తన స్వదేశం సెర్బియాకు వెళ్ళిపోయింది. అయితే అగస్త్యను ఆమె బలవంతంగా తీసుకెళ్ళిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఎయిర్ పోర్టు లోపలికి వెళుతున్నప్పుడు హార్థిక్ కొడుకు ఏడుస్తూనే ఉన్నాడు. అగస్త్యకు తండ్రితోనే ఉండడం ఇష్టంగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మరోవైపు విడాకులపై ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ పెట్టినప్పుడు అగస్త్య బాధ్యత ఎవరిదనే దానిపై కూడా హార్థిక్ క్లారిటీ ఇచ్చాడు. అగస్త్యకు ఇద్దరం మంచి కో పేరెంట్స్ గా ఉంటామని రాసుకొచ్చాడు. దీని ప్రకారం కొడుకు బాధ్యత ఇద్దరూ తీసుకుంటారనేది అర్థమవుతోంది. కొడుకు ఎవరి దగ్గర ఉండాలనేది కోర్టు నిర్ణయిస్తుంది. ప్రస్తుతం తల్లితోనే ఉంటున్న అగస్త్యతో హార్థిక్ కూడా ఎమోషనల్ అటాచ్ మెంట్ ఉంది. ఇక మరో క్రికెటర్ శిఖర్ ధావన్ కూడా గతంలో ఇలాంటి పరిస్థితే ఎదుర్కొన్నాడు. విడాకుల తర్వాత అతని భార్య ఆయేషా కొడుకును తీసుకుని ఆస్ట్రేలియాకు వెళ్ళిపోయింది. కొడుకుతో వారానికి ఒకసారి వీడియో కాల్ , సమ్మర్ వెకేషన్ లో ధావన్ తో గడిపేలా కోర్టు ఆంక్షలు విధించినప్పటకీ ఆయేషా మాత్రం వాటిని పట్టించుకోవడం లేదంటూ ధావన్ పలుసందర్భాల్లో ఆవేదన వ్యక్తం చేశాడు.