Sunrisers Eastern Cape: ఫైనల్లో సన్ రైజర్స్.. కప్పు కొట్టడమే మిగిలింది
తొలి క్వాలిఫయిర్‌లో డర్బన్ సూపర్ జెయింట్స్‌పై 51 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. ఓపెనర్ మలన్ హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు.

Sunrisers Eastern Cape: సౌతాఫ్రికాలో జరుగుతున్న టీ ట్వంటీ లీగ్‌లో సన్ రైజర్స్ దుమ్మురేపుతోంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. అంచనాలను అందుకుంటూ టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచింది. తొలి క్వాలిఫయిర్‌లో డర్బన్ సూపర్ జెయింట్స్‌పై 51 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
Smita Sabharwal: స్మితకు కష్టాలే! స్మిత సబర్వాల్ మెడకు.. భగీరథ పైపుల స్కామ్
మొదట బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. ఓపెనర్ మలన్ హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. డర్బన్ బౌలర్లు మధ్యలో వికెట్లు తీసినా.. కెప్టెన్ మార్క్‌రమ్‌తో కలిసి మలన్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. చివర్లో పుంజుకున్న డర్బన్ బౌలర్లు భారీస్కోరు చేయకుండా కట్టడి చేశారు. అయితే లక్ష్యఛేదనలో డర్బన్ సూపర్ జెయింట్స్ చేతులెత్తేసింది. సన్ రైజర్స్ బౌలర్ల ధాటికి 19.3 ఓవర్లలో 106 పరుగులకే కుప్పకూలింది. బార్ట్‌మన్, మార్కో జేన్సన్ బౌలింగ్‌కు డర్బన్ బ్యాటర్లు విలవిలలాడారు.
వియాన్ మల్డర్, క్లాసెన్, క్వింటన్ డికాక్ మాత్రమే రెండంకెల స్కోరును అందుకున్నారు. మిగిలిన బ్యాటర్లందరూ సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. సన్‌రైజర్స్ బౌలర్లలో బార్ట్‌మన్ నాలుగు ఓవర్లలో 10 పరుగులే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. జేన్సన్ 3.3 ఓవర్లలో 16 పరుగులిచ్చి 4 వికెట్లు సాధించాడు. రెండో క్వాలిఫయిర్ విజేతతో సన్‌రైజర్స్ టైటిల్ పోరులో తలపడుతుంది.