అజాజ్ పటేల్ నువ్వు తోపు
భారత గడ్డపై టెస్ట్ సిరీస్ ను న్యూజిలాండ్ సునాయాసంగా వైట్ వాష్ చేసిందంటే దానికి కారణం ఆ జట్టు బౌలర్లే... ముఖ్యంగా తొలి మ్యాచ్ లో పేసర్లు రాణిస్తే... రెండు,మూడు టెస్టుల్లో స్పిన్నర్లు అదరగొట్టేశారు.

భారత గడ్డపై టెస్ట్ సిరీస్ ను న్యూజిలాండ్ సునాయాసంగా వైట్ వాష్ చేసిందంటే దానికి కారణం ఆ జట్టు బౌలర్లే… ముఖ్యంగా తొలి మ్యాచ్ లో పేసర్లు రాణిస్తే… రెండు,మూడు టెస్టుల్లో స్పిన్నర్లు అదరగొట్టేశారు. భారత సంతతికి చెందిన అజాజ్ పటేల్ ముంబై టెస్ట్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ క్రమంలో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఒకే వేదికలో అత్యధిక వికెట్లు తీసిన విదేశీ బౌలర్ గా ఘనత సాధించాడు. ముంబై వాంఖేడే స్టేడియంలో అజాజ్ పటేల్ 23 వికెట్లు పడగొట్టాడు. తద్వారా ఇంగ్లాండ్ మాజీ ప్లేయర్ ఇయాన్ బోథమ్ రికార్డును బ్రేక్ చేశాడు. వీరిద్దరి తర్వాత రిచర్డ్ బెర్నార్డ్, వాల్ష్ ఉన్నారు. అజాజ్ పటేల్ 3 టెస్టుల్లో మొత్తం 15 వికెట్లు పడగొట్టాడు.