Ajinkya Rahane: దొరికిందే సందు.. ఐపీఎల్ కారణం అంటూ ట్రోల్స్
ఏడాదిన్నర పాటు జట్టుకు దూరమైన అజింక్య రహానే.. ఐపీఎల్‌లో అద్భుతమైన ప్రదర్శనతో తిరిగి టీమిండియా టెస్టు జట్టులోకి వచ్చాడు. డబ్ల్యూటీసీ ఫైనల్‌లో అద్భుతమైన ప్రదర్శన చేశాడీ వెటరన్ బ్యాటర్. దీంతో అతన్ని మళ్లీ వైస్ కెప్టెన్‌గా సెలెక్టర్లు నియమించారు.
Ajinkya Rahane: వెస్టిండీస్‌తో రెండో టెస్టులో భారత బ్యాటర్లు తడబడ్డారు. ముఖ్యంగా వైస్ కెప్టెన్ అజింక్య రహానే వరుసగా రెండో టెస్టులోనూ ఘోరంగా విఫలమయ్యాడు. తొలి టెస్టులో కేవలం మూడు పరుగులే చేసిన అతను.. ఈ మ్యాచ్‌లో 8 పరుగులు చేశాడు. రోహిత్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన అతను ఎక్కువ సేపు నిలవలేదు. అప్పటికే మూడు కీలక వికెట్లు కోల్పోయిన జట్టును ఆదుకుంటాడని అనుకుంటే ఏమాత్రం ప్రభావం చూపలేదు.
ఏడాదిన్నర పాటు జట్టుకు దూరమైన అజింక్య రహానే.. ఐపీఎల్‌లో అద్భుతమైన ప్రదర్శనతో తిరిగి టీమిండియా టెస్టు జట్టులోకి వచ్చాడు. డబ్ల్యూటీసీ ఫైనల్‌లో అద్భుతమైన ప్రదర్శన చేశాడీ వెటరన్ బ్యాటర్. దీంతో అతన్ని మళ్లీ వైస్ కెప్టెన్‌గా సెలెక్టర్లు నియమించారు. విండీస్ పర్యటనకు అతన్ని ఈ హోదాలోనే పంపారు. అంతే, అతని కథ మళ్లీ మొదటికి వచ్చింది. మొదటి టెస్టులో రోహిత్, జైస్వాల్ సెంచరీలతోపాటు విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ చేయడంతో భారత జట్టు భారీ స్కోరు చేసింది. దీంతో రహానే వైఫల్యాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అయితే రెండో టెస్టులో తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్.. కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇలాంటి సమయంలో వైస్ కెప్టెన్‌గా జట్టును ఆదుకుంటాడని అనుకున్న రహానే కేవలం 8 పరుగులే చేసి అవుటయ్యాడు.
గిల్, రోహిత్ వెంట వెంటనే అవుటవడంతో ఇన్నింగ్స్ చక్కదిద్దాల్సిన బాధ్యత రహానే, కోహ్లీపై పడింది. ఇలాంటి సమయంలో జాగ్రత్తగా ఆడిన రహానే.. క్రీజులో కుదురుకున్నట్లే కనిపించాడు. కానీ చివరకు రెండంకెల స్కోరు అందుకోకుండానే అవుటయ్యాడు. దీంతో అతన్ని ఫ్యాన్స్ తెగ ట్రోల్ చేస్తున్నారు. ‘ఐపీఎల్ ఫామ్ చూసి టెస్టు టీంలోకి తీసుకుంటే ఇలాగే ఉంటుంది’ అని ఫ్యాన్స్ ఎద్దేవా చేస్తున్నారు. ‘ధోనీ, చెన్నై సూపర్ కింగ్స్ లేకపోతే.. రహానే రన్స్ చేయడు’ అంటూ కొందరు జోకులు పేలుస్తున్నారు. వైస్ కెప్టెన్ అవగానే రహానే పనైపోయిందని మరికొందరు అంటున్నారు.