ROHIT SHARMA: రోహిత్‌ను కెప్టెన్ చేయండి.. ఆకాష్‌కు ఫ్యాన్స్ రిక్వెస్ట్
ముంబై ఫ్రాంచైజీ యజమాని ఆకాశ్ అంబానీ వేలం అనంతరం బయటికి రాగానే.. ‘రోహిత్ శర్మను మళ్లీ కెప్టెన్‌గా చేయండి’ అని గట్టిగా అరిచారు. అందుకు ఆకాశ్ సమాధానం ఇచ్చాడు.

ROHIT SHARMA: దుబాయ్ వేదికగా మంగళవారం ఐపీఎల్ 2024కు సంబదించిన వేలం జరిగిన విషయం తెలిసిందే. ఈ మినీ వేలం దుబాయ్‌లోని కోకాకోలా ఎరీనాలో జరగ్గా.. భారీగానే అభిమానులు అక్కడకు వచ్చారు. అందులో ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ కూడా చాలా మందే ఉన్నారు.
PRABHAS: సలార్ ఇంట్రో సీన్ బాబోయ్.. మెంటలెక్కిపోతారు
ముంబై ఫ్రాంచైజీ యజమాని ఆకాశ్ అంబానీ వేలం అనంతరం బయటికి రాగానే.. ‘రోహిత్ శర్మను మళ్లీ కెప్టెన్‌గా చేయండి’ అని గట్టిగా అరిచారు. అందుకు ఆకాశ్ సమాధానం ఇస్తూ.. అస్సలు ఆందోళన వద్దు. రోహిత్ బ్యాటింగ్ చేస్తాడు అని చెప్పాడు. ఇందుకు సబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ మార్పు.. ఆ జట్టు అభిమానులను షాక్‌కు గురి చేసింది. ఐదు టైటిళ్లను అందించిన రోహిత్ శర్మను తప్పించి.. హార్దిక్ పాండ్యాను సారథిగా నియమించడం హిట్‌మ్యాన్ అభిమానులకు మింగుడుపడడం లేదు.
దీంతో సోషల్ మీడియా వేదికగా ముంబై ఫ్రాంచైజీపై మండిపడుతున్నారు. చాలా మంది ఫాన్స్ ముంబై జట్టు సోషల్ మీడియా ఖాతాలను అన్‌ఫాలో చేశారు. అసంతృప్తిలో ఉన్న హిట్‌మ్యాన్ ఫాన్స్.. ముంబై ఫ్రాంచైజీ యజమాని ఆకాశ్ అంబానీ కనిపించగానే మళ్లీ కెప్టెన్ చేయండి అంటూ తమ అసహనాన్ని వ్యక్తం చేసారు.