AAKASH CHOPRA : టీమిండియాకు ఆకాశ్ చోప్రా సూచన
భారత్, ఇంగ్లాండ్ మధ్య రాజ్‌కోట్ వేదికగా గురువారం నుండి మూడో టెస్ట్ ప్రారంభం కానుంది. ఇప్పటికే టీమిండియా జట్టు ప్రకటించగా.. కెఎల్ రాహుల్ గాయం కారణంగా ఈ టెస్టుకు పూర్తిగా దూరం అయ్యాడు. ధృవ్ జోరెల్, కెఎస్ భరత్ వికెట్ కీపర్లు కాగా.. వీరిలో ధృవ్ జోరెల్ మూడో టెస్టుకు అరంగేట్రం చేయనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.
భారత్, ఇంగ్లాండ్ మధ్య రాజ్‌కోట్ వేదికగా గురువారం నుండి మూడో టెస్ట్ ప్రారంభం కానుంది. ఇప్పటికే టీమిండియా జట్టు ప్రకటించగా.. కెఎల్ రాహుల్ గాయం కారణంగా ఈ టెస్టుకు పూర్తిగా దూరం అయ్యాడు. ధృవ్ జోరెల్, కెఎస్ భరత్ వికెట్ కీపర్లు కాగా.. వీరిలో ధృవ్ జోరెల్ మూడో టెస్టుకు అరంగేట్రం చేయనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. తొలి మ్యాచ్‌లో అర్ధ సెంచరీ చేసినప్పటికీ.. తర్వాత భరత్ ఆకట్టుకోలేకపోయాడు. అయితే భరత్ ను తప్పిస్తారన్న వార్తలపై భారత మాజీ వికెట్ కీపర్ ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు.
మూడో టెస్టులో శ్రీకర్ భారత్‌ను వికెట్ కీపర్‌గా కొనసాగించాలని సూచించాడు. బ్యాటింగ్‌లో నిరాశపరిచినా కీపర్‌గా భరత్ అద్భుతంగా రాణిస్తున్నాడని ప్రశంసించాడు. భరత్ కీపింగ్ విషయంలో ఎలాంటి తప్పు చేయలేదనీ, అతడి బ్యాటింగ్ వైఫల్యాన్ని భూతద్దంలో చూడద్దని విజ్ఞప్తి చేశాడు. రాహుల్‌ను బ్యాటర్‌గా ఎంచుకుని.. భరత్‌ను కీపర్‌గా ఎంచుకున్నప్పుడు.. వారిద్దరి పెర్ఫార్మెన్స్‌లు ఆయా బాధ్యతల్లోనే చూడాలన్నాడు. భరత్‌ను స్పెషలిస్ట్ కీపర్‌గానే పరిగణనలోకే తీసుకోవాలనీ, ఒకవేళ బ్యాటర్‌గా చూడాలనుకుంటే.. కనీసం మరొక్క మ్యాచ్ అవకాశం ఇవ్వాలని అభిప్రాయపడ్డాడు.