Rohit Sharma : రోహిత్ ముంబైకు ఇక ఆడడు.. కోల్ కత్తాకు ఆడితే బాగుంటుందన్న అక్రమ్
ముంబై ఇండియన్స్ (Mumbai Indians) మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఆ జట్టుకు గుడ్ బై చెబుతాడని పాకిస్థాన్ (Pakistan) మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ (Wasim Akram) అన్నాడు. వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్ (IPL) లో అతను ముంబై ఇండియన్స్‌కు ఆడడని అభిప్రాయపడ్డాడు.

Akram says that Rohit Mumbai will play better
ముంబై ఇండియన్స్ (Mumbai Indians) మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఆ జట్టుకు గుడ్ బై చెబుతాడని పాకిస్థాన్ (Pakistan) మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ (Wasim Akram) అన్నాడు. వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్ (IPL) లో అతను ముంబై ఇండియన్స్‌కు ఆడడని అభిప్రాయపడ్డాడు. ఇక రోహిత్ శర్మ కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున ఆడితే తనకు చూడాలని ఉందన్నాడు. గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) మెంటార్‌గా.. రోహిత్ శర్మ ఓపెనర్‌గా.. శ్రేయస్ అయ్యర్ సారథిగా ఉంటే కేకేఆర్ బ్యాటింగ్ చాలా బలంగా ఉంటుందన్నాడు. అదే జరిగితే ఈడెన్ గార్డెన్స్‌లో పరుగుల వరద పారుతుందని అక్రమ్ చెప్పాడు. ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి ముందు ముంబై ఇండియన్స్ తమ కొత్త సారథిగా హార్దిక్ పాండ్యాను నియమించింది. ఐదు టైటిళ్లు అందించిన రోహిత్ శర్మను పక్కనపెట్టి హార్దిక్‌కు జట్టు పగ్గాలు అప్పగించింది.ఈ నిర్ణయంపై సోషల్ మీడియా వేదికగా దుమారమే రేగింది.
ఈ క్రమంలోనే అప్‌కమింగ్ సీజన్‌కు రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్‌కు ఆడడనే చర్చ మొదలైంది. ఇక ఓ ఇంటర్వ్యూలో ముంబై ఇండియన్స్ తర్వాత తాను ఆడాలనుకునే జట్టు కోల్ కత్తానే అంటూ రోహిత్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. అప్పటి నుంచి రోహిత్ కేకేఆర్ జట్టులోకి వెళ్తాడనే ప్రచారం జోరందుకుంది. తాజాగా రోహిత్ శర్మ గురించి ఓ చానెల్‌తో మాట్లాడిన వసీం అక్రమ్.. అతను కేకేఆర్ జట్టు తరఫు ఆడితే చూడాలని ఉందని చెప్పాడు. ప్రస్తుతం వసీం అక్రమ్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.