Delhi: డిప్యూటీ పోస్ట్ పొందిన అక్షర్ పటేల్
ఐపీఎల్ -16 లో ఢిల్లీ తమ తొలి మ్యాచ్ ను మార్చి 31న లక్నో సూపర్ జెయింట్స్ తో ఆడనుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది.
కెప్టెన్ గా డేవిడ్ వార్నర్ ను నియమించగా, వైస్ కెప్టెన్ గా అక్షర్ పటేల్ ను ఎంపిక చేసింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో గొప్ప ప్రదర్శన కనబరిచిన ఈ ఆల్ రౌండర్ కు ఢిల్లీ ప్రొమోషన్ ఇచ్చింది. అయితే ఢిల్లీకి వార్నర్ కెప్టెన్ గా ఉండడం ఇది మొదటిసారేం కాదు. 2009 నుంచి 2013 సీజన్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్‌కు ఆడిన వార్నర్.. అప్పుడు కూడా కొన్ని మ్యాచ్ లకు తాత్కాలిక సారథిగా ఉన్నాడు. తాజాగా మళ్లీ పూర్తిస్థాయిలో ఢిల్లీని నడిపించనున్నాడు. ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ ఇంకా పూర్తిగా కోలుకోలేక పోవడంతో ఢిల్లీ పగ్గాలు వార్నర్ చేతికొచ్చాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఇంతవరకూ ట్రోఫీ నెగ్గని జట్లలో ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఒకటి. 2020 సీజన్ లో ఆ జట్టు ఫైనల్స్‌కు వెళ్లినా ట్రోఫీ మాత్రం కొట్టలేకపోయింది.
అయితే, ఈసారి మెంటర్ గా వ్యవహరించనున్న గంగూలీ, కోచ్ పాంటింగ్ లు తమ జట్టుకు కప్పును తీసుకురావాలి అని, ఢిల్లీ కో ఓనర్ పార్థ్ జిందాల్ ఆశిస్తున్నారు. ఇటీవల సన్ రైజర్స్ జట్టును ఛాంపియన్ గా నిలిపిన వార్నర్ హస్తవాసిని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బలంగానే నమ్ముతుంది. మిచెల్ మార్ష్, మనీష్ పాండే, ఫీల్ సాల్ట్, ఖలీల్ అహ్మద్, సర్ఫరాజ్ ఖాన్ వంటి ఆటగాళ్లతో ఢిల్లీ చాల పటిష్టంగా ఉండడంతో, హాట్ ఫెవరైట్ జట్లలో ఒకటిగా ఐ పి ఎల్ లో బరిలో దిగనుంది.