Craig Brathwaite: ఆట కాదు వేట చూస్తారు రగిలిపోతున్న విండీస్ కెప్టెన్
చరిత్రలో తొలిసారిగా వెస్టిండీస్ వన్డే ప్రపంచకప్‌కు దూరం కావడంతో తీవ్ర నిరాశలో ఉన్నారు ఆ జట్టు అభిమానులు. అయితే ఆ సంగతెలా ఉన్నప్పటికీ.. భారత్ లాంటి పెద్ద జట్టుతో జరగబోయే టెస్టు సిరీస్‌కు అభిమానులు పెద్ద ఎత్తున స్టేడియాలకు తరలి రావాలని విండీస్ టెస్టు సారథి క్రెయిగ్ బ్రాత్‌వైట్ పిలుపునిచ్చాడు.

Craig Brathwaite Welcome to All cricket Fans to first test
‘‘డొమినికాలో తొలి టెస్టు జరగబోతోంది. ఇక్కడి అభిమానులంతా పెద్ద ఎత్తున స్టేడియాలకు రావాలి. ట్రినిడాడ్‌లోనూ క్రికెట్‌ను ఎంతో ఇష్టపడే అభిమానులున్నారు. వాళ్లందరూ గర్వించేలా చేయడానికి మేం మా వంతుగా గట్టి ప్రయత్నం చేస్తాం’’ అని బ్రాత్‌వైట్ అన్నాడు. భారత్‌తో సిరీస్ పట్ల తమ జట్టంతా ఎంతో ఆసక్తిగా ఉందని బ్రాత్‌వైట్ తెలిపాడు. ఈ పర్యటనలో భారత్ రెండు టెస్టులు, మూడు వన్డేలు, అయిదు టీ20లు ఆడనుంది. తొలి టెస్టు ఈ నెల 12న డొమినికాలో మొదలవుతుంది. ఇదిలా ఉండగా.. వన్డే ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో నామమాత్రమైన సూపర్-6 మ్యాచ్‌లో వెస్టిండీస్ ఏడు వికెట్ల తేడాతో ఒమన్‌పై ఘనవిజయం సాధించింది.