Dravid: ద్రావిడ్ సార్ టైగర్లను చేస్తా అని టామీలుగా..
వెస్టిండీస్ టీ 20 మ్యాచ్ లో హార్థిక్ పాండ్యా కెప్టెన్సీ లోపాలతోపాటూ కోచ్ రాహూల్ ద్రావిడ్ పై కూడా విమర్శలు వస్తున్నాయి.

Along with coach Rahul Dravid, Harthik Pandya's captaincy has been criticized
హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్‌ను తమ తొలి సీజన్‌లో తొలి ఐపీఎల్ టైటిల్ అందించాడు. అప్పుడు రోహిత్ శర్మ తర్వాత హార్దిక్ పాండ్యా అని అనుకున్నారు. రోహిత్ అధికారికంగా భారత టీ20 కెప్టెన్‌గా వైదొలగనప్పటికీ టీ20 మ్యాచులకు పాండ్యా కెప్టెన్సీ చేస్తున్నాడు. ఇప్పుడు వెస్టిండిస్ పర్యటనలో కూడా హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా కొనసాగుతోన్నారు. అయితే 7వ ర్యాంక్‌లో ఉన్న వెస్టిండీస్ చేతిలో వరుస పరాజయాల తర్వాత, హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలో, మాజీ భారత వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ హార్దిక్ కెప్టెన్సీలో ఇటీవలి లోపాలను విశ్లేషిస్తూ, టీ20 కోచ్‌గా ద్రవిడ్ అర్హతలపై తన సందేహాలను వ్యక్తం చేశాడు. రాహుల్ ద్రవిడ్ అంటే మనం టీ20 ఫార్మాట్‌లో వెతుకుతున్న చురుకైన కోచ్ అని నేను అనుకోను, అని పార్థీవ్ చెప్పుకొచ్చాడు. ఈ మాజీ క్రికెటర్ కు కొందరు అభిమానులు మద్దతుగా నిలిస్తే, ద్రావిడ్ ను నమ్మొచ్చు, ఇంకో 3 మ్యాచులు మిగిలున్నాయి కదా అని మరికొందరు ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.