Ashwin: అయినా కూడా అయ్యగారే నంబర్ వన్
భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ నంబర్‌వన్ టెస్టు బౌలర్‌గా కొనసాగుతున్నాడు. ఐసీసీ తాజా టెస్టు ర్యాంకింగ్స్‌లో అతడు 860 పాయింట్లతో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు.
ఇటీవల ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో అశ్విన్‌కు ఆడే అవకాశం దక్కని సంగతి తెలిసిందే. 829 పాయింట్లతో అండర్సన్ రెండో స్థానంలో ఉన్నాడు. బుమ్రా 772 పాయింట్లతో జడేజా 765 పాయింట్లతో 8, 9వ స్థానాల్లో నిలిచారు. బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లి 700 పాయింట్లతో ఒక ర్యాంకు నష్టపోయి 14వ స్థానానికి చేరుకున్నాడు. రోహిత్ శర్మ 729 పాయింట్లతో 12వ స్థానంలో ఉన్నాడు. పుజారా 25వ ర్యాంకులో కొనసాగుతున్నాడు.
భారత్ నుంచి ఒక్క రిషబ్ పంత్ 10వ స్థానం దక్కించుకొని టాప్-10లో ఉన్నాడు. అతడి ఖాతాలో 758 పాయింట్లు ఉన్నాయి. యాషెస్ తొలి టెస్టులో రాణించిన జో రూట్ 887 పాయింట్లతో లబుషేన్‌ను వెనక్కి నెట్టి నంబర్‌వన్ బ్యాటర్‌గా నిలిచాడు. అతడు అయిదు స్థానాలు ఎగబాకాడు. లబుషేన్ 877 పాయింట్లతో మూడో స్థానానికి పడిపోయాడు. విలియమ్సన్ 883 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు.