Ambati Rayudu: అభిమానులు మరువలేని జ్ఞాపకాల రాయుడు

ఐపీఎల్‌లో ముంబై-చెన్నై అభిమానుల కామన్‌ ఫేవరెట్‌. స్టార్‌ క్రికెటర్‌ అంబటి రాయుడు ఐపీఎస్‌ కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. 13 ఏళ్లు ఐపీఎల్‌లో అభిమానులను అలరించిన రాయుడు ఇప్పుడు రిటైర్ అవుతున్నాడంటే అటు ముంబై ఇటు చెన్నై అభిమానుల మనసుల్లో ఏదో తెలియని బాధ.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 30, 2023 | 01:30 PMLast Updated on: May 30, 2023 | 1:30 PM

Ambati Rayudu Best Cricket Player

నిజానికి ముంబై-చెన్నై ఫ్యాన్స్‌ది టామ్ అండ్‌ జెర్రీ లాంటి బంధం. ఒకరంటే ఒకరికి పడకోయినా వాళ్ల మధ్య గొడవ హద్దుమీరదు. కానీ ఈ రెండు టీమ్‌ ఫ్యాన్స్‌ కామన్‌గా అభిమానించే స్టార్ అంబటి రాయుడు మాత్రమే. అతనిపై ముంబై అభిమానులు చూపించే ప్రేమ అపూర్వం. టీంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఫ్యాన్స్‌కు అత్యంత దగ్గరయ్యాడు రాయుడు. 2011లో బెంగళూరుపై జరిగిన మ్యాచ్‌లో.. ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా ఎన్నికైన సచిన్‌..తన అవార్డును రాయుడుతో కలిసి షేర్‌ చేసుకుంటానని చెప్పి..నేరుగా తన వద్దకు వెళ్లి అవార్డును పంచుకోవడం.. క్యాష్ చెక్‌ని అంబటికి ఇచ్చేయడం అభిమానులకు ఎప్పటికీ మర్చిపోలేరు.

ముంబై జట్టు ఆపదలో ఉన్న ప్రతిసారి పొలార్డ్‌తో రాయుడి నెలకొల్పిన పార్టనెర్‌షిప్‌లు సచిన్‌-రోహిత్‌ టీమ్‌ను గెలిపించాయి. స్కోర్‌ కార్డు చూసేవాళ్లకి రాయుడు ఆడింది తక్కువగా కనిపించినా.. అతను ఏ పరిస్థితిలో ఎలా ఆడాడో.. ఓడిపోయే మ్యాచ్‌ను ఎలా గెలిపించాడో మ్యాచ్‌ మొత్తం చూసినవాళ్లకే అర్థమవుతుంది. 2010 నుంచి 2017వరకు ముంబై తరఫున సేవియర్ రోల్ ప్లే చేసిన రాయుడు.. 2018 నుంచి చెన్నై తరుపున బరిలోకి దిగాడు. ఓపెనర్‌గా వచ్చి తనలోని మరో యాంగిల్‌ని ప్రపంచానికి చూపించాడు. రాయుడు ఇలా కూడా ఆడతాడా అని అనిపించేలా కొత్త రోల్‌లో అదరగొట్టాడు.

సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 52 బాల్స్‌లో 100 రన్స్‌ చేసిన రాయుడు.. ఐపీఎల్‌లో తన ఫస్ట్‌ సెంచరీ బాదాడు. ముంబై తరఫున ఫినీషర్‌ బాధ్యతలో ఒదిగిపోయిన రాయుడు.. చెన్నై తరుఫున ఓపెనర్‌గా పరుగుల వర్షం కురిపించాడు.. ఆ ఏడాది చెన్నై కప్‌ గెలవడంలో రాయుడిదే కీలక పాత్ర.. ఇక 2021లో ముంబైపై రాయుడు ఆడిన ఇన్నింగ్స్‌ ఐపీఎల్‌ హిస్టరీలోని గొప్ప ఇన్నింగ్స్‌లలో ఒకటి. కేవలం 27 బాల్స్‌లో 72 రన్స్‌ చేసిన రాయుడు.. ఆ మ్యాచ్‌లో చెన్నైని గెలిపించాడు.. అదే ఏడాది అతని ఖాతాలో మరో ఐపీఎల్‌ ట్రోఫీ వచ్చి పడింది. ఇక నిన్నటి ఫైనల్‌ మ్యాచ్‌లోనూ రాయుడు ఇన్నింగ్సే చెన్నై గెలుపుకు దారులు వేసింది.

ముంబై తరుఫున మూడు సార్లు ట్రోఫీ అందుకున్న రాయుడు.. చెన్నై తరుఫున మూడుసార్లు కప్‌ గెలిచాడు. రాయుడు ఐపీఎల్‌ కెరీర్‌లో నాలుగు వేలకుపైగా రన్స్‌ ఉన్నాయి. 14 సీజన్లలో 11 సార్లు ఫ్లేఆఫ్‌కు వచ్చాడు. 8 సార్లు ఫైనల్‌కు వచ్చాడు. 6 సార్లు ట్రోఫీ గెలిచాడు. కేవలం ఈ ట్రోఫీలు మాత్రమే రాయుడి విజయం కాదు. ముంబై, చెన్నై అభిమానుల్లో అతను సంపాదించున్న సుస్థిర స్థానం రాయుడి అసలు విజయం.