Ambati Rayudu: ఆ జట్టు ఎప్పటికీ టైటిల్ గెలవదు.. ఆర్సీబీపై రాయుడు సంచలన వ్యాఖ్యలు
ఆ టీమ్ లోని టాప్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అందరూ టాప్ లోనే బ్యాటింగ్ కు దిగి విఫలమవుతున్నారనీ, దీంతో భారమంతా లోయర్ మిడిలార్డర్ లో వచ్చే అనూజ్ రావత్, దినేష్ కార్తీక్, మహిపాల్ లోమ్రోర్ లాంటి వాళ్లపై పడుతోందన్నాడు.

Ambati Rayudu flop show
Ambati Rayudu: యే సాలా కప్ నమదే ఇదీ ప్రతీసారీ ఐపీఎల్ ఆరంభానికి ముందు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నినాదం. కానీ యేళ్లు గడుస్తున్నా బెంగుళూరు మాత్రం టైటిల్ కు ఆమడ దూరంలోనే ఉండిపోతుంది. ఈ సీజన్ లో కూడా మూడు ఓటములతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది. తాజాగా ఆ జట్టుపై అంబటి రాయుడు సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆర్సీబీ ఎప్పటికీ ఐపీఎల్ గెలవదంటూ రాయుడు విమర్శించాడు.
Trivikram: మాటల మాంత్రికుడి సాయం.. నితీష్ మాటకు త్రివిక్రమ్ ఓకే చెప్తారా..?
ఆ టీమ్ లోని టాప్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అందరూ టాప్ లోనే బ్యాటింగ్ కు దిగి విఫలమవుతున్నారనీ, దీంతో భారమంతా లోయర్ మిడిలార్డర్ లో వచ్చే అనూజ్ రావత్, దినేష్ కార్తీక్, మహిపాల్ లోమ్రోర్ లాంటి వాళ్లపై పడుతోందన్నాడు. ఇలా అయితే ట్రోఫీ ఎలా గెలుస్తారంటూ రాయుడు ప్రశ్నించాడు. అంతర్జాతీయ క్రికెట్ ఆడే ప్లేయర్స్ ఎవరైతే ఒత్తిడిని తట్టుకుంటారో వాళ్లు ఎక్కడ..అందరూ అప్పటికే డ్రెస్సింగ్ రూమ్‌లో కూర్చొన్నారంటూ వ్యాఖ్యానించాడు. గత 16 ఏళ్లుగా ఈ టీమ్ తో ఇదే జరుగుతూ వస్తోందన్నాడు. గతంలో గేల్, కోహ్లి, డివిలియర్స్ లాంటి వాళ్లు ఉన్నప్పుడు కూడా వాళ్లంతా బ్యాటింగ్ ఆర్డర్లో పైనే వచ్చేవారని రాయుడు ప్రస్తావించాడు.
ఈ కామెంట్స్‌తో భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ నవజోత్ సింగ్ సిద్ధు కూడా ఏకీభవించాడు. రాయుడు మాట్లాడింది కరెక్ట్ అని చెప్పాడు. లక్నోతో జరిగిన మ్యాచ్‌లో 28 పరుగుల తేడాతో ఓడింది ఆర్సీబీ. లక్నో ఇచ్చిన 181 పరుగుల టార్గెట్ రీచ్ కాలేక.. 153 పరుగులకే కుప్పకూలింది.
cs