AMBATI RAYUDU : అంబటి రాయుడు ఫ్లాప్ షో
దుబాయ్వే (Dubai) దికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ టీ20 (International, T20) లీగ్‌లో టీమిండియా (Team India) మాజీ క్రికెటర్ అంబటి రాయుడు నిరాశపరుస్తున్నాడు. ఈ లీగ్‌లో ముంబై ఇండియన్స్‌కు (Mumbai Indians) చెందిన ఎంఐ ఎమిరేట్స్‌కు రాయుడు (Ambati Rayudu) ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. గల్ఫ్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయుడు స్లో ఇన్నింగ్స్ ఆడి ముంబై ఓటమికి కారణమయ్యాడు.

Ambati Rayudu flop show
దుబాయ్వే (Dubai) దికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ టీ20 (International, T20) లీగ్‌లో టీమిండియా (Team India) మాజీ క్రికెటర్ అంబటి రాయుడు నిరాశపరుస్తున్నాడు. ఈ లీగ్‌లో ముంబై ఇండియన్స్‌కు (Mumbai Indians) చెందిన ఎంఐ ఎమిరేట్స్‌కు రాయుడు (Ambati Rayudu) ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. గల్ఫ్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయుడు స్లో ఇన్నింగ్స్ ఆడి ముంబై ఓటమికి కారణమయ్యాడు. మిడిలార్డర్‌లో ధనాధన్ ఇన్నింగ్స్‌లు ఆడే రాయుడు గల్ఫ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగాడు. కానీ ఆరు బంతులు ఎదుర్కొని ఒక్క పరుగే చేసి వెనుదిరిగాడు. 2 వికెట్లకు 40 పరుగుల స్కోర్ దగ్గర బ్యాటింగ్‌కు వచ్చిన రాయుడు తక్కువ స్కోరుకే ఔటవ్వడమే కాకుండా, జట్టును ఒత్తిడిలోకి నెట్టాడు. స్వల్ప వ్యవధిలోనే రెండు వికెట్లు పడటంతో ముంబై ఆత్మరక్షణతో బ్యాటింగ్ చేసి ఓటమి పాలైంది. 158 పరుగుల టార్గెట్‌ను ఆ జట్టు ఛేదించలేకపోయింది. పొల్లార్డ్ పోరాడినప్పటకీ ముంబై 5 పరుగుల తేడాతో ఓడిపోయింది. రాయుడు స్లో ఇన్నింగ్స్‌తో ముంబై ఓడిపోవడం ఈ లీగ్‌లో ఇది రెండోసారి. కాగా ఇప్పటికే ముంబై ఎమిరేట్స్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది.