Sania Mirza: టెన్నిస్ కాదు.. క్రికెట్ కాదు.. సానియా-షోయబ్‌ల కొడుకు ఎంట్రీ దేనిలోనో తెలుసా..?
2018లో ఇజాన్ మాలిక్‌కు జన్మనిచ్చిన సానియా.. తర్వాత భర్తతో కలిసి ఉన్న సందర్భాలు తక్కువే. దీనికి తోడు గత ఏడాదిన్నర కాలంగా సానియా-షోయబ్ జోడీ విడాకులు తీసుకుంటున్నట్టు వార్తలు వచ్చాయి.
Sania Mirza: భారత టెన్నిస్‌లో సానియామీర్జా తెలియని అభిమాని ఉండడు. ఆటతో పాటే గ్లామర్‌తోనూ, వివాదాలతోనూ వరుసగా వార్తల్లో నిలిచిన సానియా.. పాక్ క్రికెట్ షోయబ్ మాలిక్‌ను పెళ్లి చేసుకుంది. పాకిస్తాన్ వ్యక్తిని పెళ్లి చేసుకున్నందుకు విమర్శలు ఎదుర్కొన్నా వెనక్కి తగ్గలేదు. వీరి జోడీ వరల్డ్ బెస్ట్ స్టార్ కపుల్‌గా ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ వచ్చారు. 2018లో ఇజాన్ మాలిక్‌కు జన్మనిచ్చిన సానియా.. తర్వాత భర్తతో కలిసి ఉన్న సందర్భాలు తక్కువే.
BIG BOSS CASE : బిగ్ బాస్ నిర్వాహకులకు నోటీసులు ఇకపై ర్యాలీలు నిషేధించే ఛాన్స్ !
దీనికి తోడు గత ఏడాదిన్నర కాలంగా సానియా-షోయబ్ జోడీ విడాకులు తీసుకుంటున్నట్టు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం విడివిడిగానే ఉంటున్న వీరిద్దరూ కొడుకు ఇజాన్ కోసం దుబాయ్‌లో కలుస్తున్నారు. తాజాగా ఇజాన్ మాలిక్ స్విమ్మింగ్‌లో ఎంట్రీ ఇచ్చాడు. స్కూల్ స్థాయిలో తొలి విజయాన్ని కూడా అందుకున్నాడు. కొడుకు తొలి విజయాన్ని సానియా-షోయబ్ కలిసే సెలబ్రేట్ చేసుకున్నారు. దుబాయ్‌లోని ఓ ప్రైవేట్ అకాడమీలో జరిగిన స్విమ్మింగ్ పోటీల్లో ఇజాన్ మాలిక్ రెండు మెడల్స్ గెలిచాడు. దీనికి సంబంధించిన ఫోటోలను సానియా-షోయబ్ తమ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. తనను చూస్తుంటే గర్వంగా ఉందంటూ ఈ పోస్టులో రాసుకొచ్చారు.
కాగా పాక్‌కు చెందిన ఓ మోడల్‌తో షోయబ్ సన్నిహితంగా ఉండడంతోనే సానియాతో విభేదాలు వచ్చాయని పలు కథనాలు వెలువడ్డాయి. అప్పటి నుంచే వీరిద్దరూ దూరంగా ఉంటున్నారు. అయితే తమ విడాకులపై ఇప్పటి వరకూ అధికారిక ప్రకటన మాత్రం చేయలేదు.