Clarke, Kohli : డకౌట్ కావాలి అంటే.. దంచి కొట్టాడు..
ప్రస్తుత ప్రపంచకప్ జట్టులో ఉన్న భారత్ ఆటగాళ్లలో చెపాక్ లో సెంచరీ చేసిన రికార్డు విరాట్ కోహ్లీకి మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో కోహ్లీ సెంచరీ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే ఆసీస్ మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ మాత్రం మ్యాచుకు ముందు భిన్నంగా స్పందించాడు.

Among the Indian players in the current World Cup squad Virat Kohli is the only player to have scored a century in Chepauk Former Aussie captain Michael Clarke wanted Kohli to be ducked in the Australia match
ప్రస్తుత ప్రపంచకప్ జట్టులో ఉన్న భారత్ ఆటగాళ్లలో చెపాక్ లో సెంచరీ చేసిన రికార్డు విరాట్ కోహ్లీకి మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో కోహ్లీ సెంచరీ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే ఆసీస్ మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ మాత్రం మ్యాచుకు ముందు భిన్నంగా స్పందించాడు. ఆస్ట్రేలియా మ్యాచ్‌లో కోహ్లీ డకౌట్ కావాలని కోరుకున్నాడు. అంతేకాదు ఫైనల్లో ఆస్ట్రేలియాతో భారత్ తలపడాల్సి వస్తే.. సెంచరీ చేయొద్దని కోరుకున్నాడు. వన్డే ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ డకౌట్ అయితే చూడాలనుంది. తర్వాత ప్రతి మ్యాచ్‌లోనూ సెంచరీ చేసినా పర్లేదు. అయితే ఫైనల్లో ఆస్ట్రేలియాతో భారత్ తలపడాల్సి వస్తే మాత్రం సెంచరీ చేయొద్దని కోరుకుంటా. ఫైనల్లో కూడా విరాట్ డకౌట్ కావాలి’ అని వింత వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ ఈ మ్యాచ్ లో ఇప్పటికే డబుల్ డిజిట్ స్కోర్ చేశాడు. దాంతో మైకేల్ క్లార్క్ ఆశ నెరవేరకుండా పోయింది. దీంతో, విరాట్ అభిమానులు, చాలా ఇంకా కావాలా అంటూ, రెబెల్ కామెంట్స్ తో క్లార్క్ కు రిప్లయ్ ఇస్తున్నారు.