Sarfaraz Khan: వావ్‌.. సూపర్‌.. సర్ఫరాజ్ తండ్రికి అదిరిపోయే గిఫ్ట్‌..

ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్ర కూడా సర్ఫరాజ్ తండ్రి ప్రేమకు ఫిదా అయ్యాడు. అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చి తన గొప్ప మనసు చాటుకున్నాడు. సర్ఫరాజ్ తండ్రి గొప్పదనం చెప్తూ.. ఎమోషనల్ ట్వీట్‌ చేశాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 16, 2024 | 04:35 PMLast Updated on: Feb 16, 2024 | 4:35 PM

Anand Mahindra Offers Thar As Gift To Sarfaraz Khans Father Naushad Khan

Sarfaraz Khan: సర్ఫరాజ్‌ ఖాన్.. క్రికెట్‌ సర్కిల్స్‌లో విపరీతంగా తిరుగుతున్న పేరు. ఇంగ్లండ్‌తో టెస్ట్‌లో చెప్పినట్లే చెలరేగిపోయాడు. అద్భుతమైన హాఫ్ సెంచరీతో అలరించాడు. రనౌట్ అయ్యాడు కాబట్టి ఆగాడు కానీ.. లేకపోతే సీన్ ఇంకోలా ఉండేది అనిపించింది సర్ఫరాజ్‌ బ్యాటింగ్‌ చూస్తుంటే. దేశవాళీ క్రికెట్‌లో పరుగుల సునామీ క్రియేట్ చేసి అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు సర్ఫరాజ్.

Congress Bank Accounts: కాంగ్రెస్ పార్టీకి షాక్.. బ్యాంకు ఖాతాల స్తంభన.. ఆ వెంటనే

ఇండియన్‌ వెటరన్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే అరంగేట్ర క్యాప్ అందించగా.. సర్ఫరాజ్‌ తండ్రి నౌషాద్ ఖాన్, సర్ఫరాజ్‌ భార్య భావోద్వేగానికి లోనయ్యారు. దీనికి సంబంధించినవ వీడియో, ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్ అయ్యాయ్. జెర్సీ నంబర్ 97తో బరిలోకి దిగిన సర్ఫరాజ్.. అరంగేట్రంలోనే తనేంటో, తను ఎంత ప్రమాదకరమో ఇంగ్లీష్ టీమ్‌కు పరిచయం చేశాడు. సర్ఫరాజ్ అందించిన క్యాప్‌ను అతని తండ్రి ముద్దాడిన విజువల్స్.. ఇప్పుడు ప్రతీ ఒక్కరితో కన్నీళ్లు పెట్టిస్తున్నాయ్. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్ర కూడా సర్ఫరాజ్ తండ్రి ప్రేమకు ఫిదా అయ్యాడు. అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చి తన గొప్ప మనసు చాటుకున్నాడు. సర్ఫరాజ్ తండ్రి గొప్పదనం చెప్తూ.. ఎమోషనల్ ట్వీట్‌ చేశాడు.

‘విశ్వాసం కోల్పోవద్దు.. కఠోర శ్రమ, ధైర్యం, సహనం.. పిల్లల్లో ఒక తండ్రి స్ఫూర్తి నింపేందుకు ఇంతకంటే గొప్ప లక్షణాలు ఏముంటాయ్.. ఎంతో మందికి ఇన్‌స్పిరేషన్‌ అయిన నౌషద్‌ ఖాన్‌కు థార్‌ బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నా.. ఈ గిఫ్ట్‌ ఆయన తీసుకుంటారని నమ్ముతున్నా’ అంటూ ట్వీట్‌ చేశారు ఆనంద్‌ మహీంద్రా. ఇక అటు సర్ఫరాజ్ తండ్రి నౌషాద్ కూడా క్రికెటర్. తన కలను కొడుకు కళ్లతో కన్న నౌషద్‌.. తనే ట్రైనింగ్ ఇచ్చాడు.