Adudam Andhra Scheme : “ఆడుదాం ఆంధ్ర స్కీం” సరే .. క్రీడాకారులకు ప్రోత్సాహం ఏదీ..?
ఆంధ్రాప్రదేశ్ యువతను అంతర్జాతీయ వేదికలపై ఆడేలా.. జగన్ సర్కార్ సరికొత్త కార్యక్రమానికి రూపకల్పన చేసి ఆడుదాం ఆంధ్రా కు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.. ఆడుదాం ఆంధ్ర పేరుతో గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వివిధ రకాల క్రీడల్లో యువశక్తినితట్టి లేపి రాష్ట్రాన్ని అభివృద్ధి లో భాగస్వామ్యం చేయాలని సంకల్పించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
ఆంధ్రాప్రదేశ్ యువతను అంతర్జాతీయ వేదికలపై ఆడేలా.. జగన్ సర్కార్ సరికొత్త కార్యక్రమానికి రూపకల్పన చేసి ఆడుదాం ఆంధ్రా కు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.. ఆడుదాం ఆంధ్ర పేరుతో గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వివిధ రకాల క్రీడల్లో యువశక్తినితట్టి లేపి రాష్ట్రాన్ని అభివృద్ధి లో భాగస్వామ్యం చేయాలని సంకల్పించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. గ్రామీణ స్థాయిలో పోటీలు ఆడే యువశక్తిని సేకరించి .. వారి నైపుణ్యాలను రాష్ట్రం మే ఉచితంగా అంతర్జాతీయ క్రీడలకు అధికారికంగా శిక్షణ ఇచ్చి.. అంతర్జాతీయ వేదికలపై పోటీలకు సిద్ధం చేస్తుంది. మట్టిలో మాణిక్యాలను వెలికితీసి.. రాష్ట్రం నుంచి ఐపీఎల్ జట్టును తయారు చేస్తామని ఆర్భాటంగా చెప్పారు.
జాతీయ క్రీడల్లో పతకాలు సాధించిన వారికి ప్రభుత్వం చిన్న చూపు ..
గత ఏడాది సెప్టెంబర్ లో గుజరాత్ లో జరిగిన 36వ జాతీయ క్రీడలు 35 పతకాలు సాధించారు రాష్ట్ర క్రీడాకారులు. ఆంధ్రప్రదేశ్ నుంచి పోటీలో నిలబడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 35 సాధించి రాష్ట్రానికి పేరు ప్రఖ్యయతలు సాధించారు. రాష్ట్రానికి మెడల్స్ తీసుకొచ్చే సందర్భంగా వారి క్రీడా శిక్షణ కోసం ప్రభుత్వం కోటి 25 లక్షలు ఇస్తామని ప్రకటించింది.
- స్వర్ణం పతకం సాధించిన వారికి 5 లక్షలు..
- వెండి పతకం సాధించిన వారికి 4 లక్షలు..
- రజత పతకం సాధించిన వారికి 3 లక్షలు ..
ఇలా బహుమతులు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన సంవత్సరం కావస్తున్న నేటికి ఆ బహుమతుల ఊసే లేదు. ఇదే విషయం పై స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ మేనేజింగ్ డైరెక్టర్ ను ప్రభుత్వం అప్పట్లో ఆదేశిస్తూ 2022 నవంబరు 14న జీవో 208 విడుదల చేసింది. గతంలో గెలిచిన క్రీడాకారుల బ్యాంక్ ఖాతాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ సేకరిచినప్పటికి క్రీడాకారులతో ఇదిగో .. అదిగో అంటున్న అకౌంట్ లో మాత్రమే నగదు జమ కావడం లేదు. ఇలాగే సంవత్సరం పాటు కాలయాపన చేస్తున్నారు.
వచ్చే నెలలో గోవాలో 37వ జాతీయ క్రీడలు ప్రారంభం..
నవంబర్ లో గోవా వేదికగా 37వ జాతీయ క్రీడలు ప్రారంభం కానున్నాయి. గుజరాత్ కు వెళ్లిన క్రీడాకారులే మళ్లి వచ్చే నెలలో.. గోవాలో జరిగే జాతీయ క్రీడల్లో పాల్గొనబోతున్నారు. వారి శిక్షణ కోసం ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు క్రీడాకారుల తల్లిదండ్రులు వాపోతున్నారు. గత గుజరాత్ లో గెలుపొందిన సందర్భంగా నగదు బహుమతిని నేటికీ ప్రభుత్వం చేతికి ఇవ్వక.. నగదు కోసం షాప్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్న క్రీడాకారులు.
త్వరలో ఆంధ్రప్రదేశ్ లో అభినందన సభ..
ఆంధ్రప్రదేశ్ త్వరలోనే గత జాతీయ క్రీడల్లో గెలుపొందిన క్రీడాకారులకు నగదు బహుమతి ప్రకటిస్తామని చెబుతున్నారు.
S.SURESH